దసరా జోడీ 'ఉగాది' వైబ్రేషన్స్..!

Wed Mar 22 2023 12:00:00 GMT+0530 (India Standard Time)

Dasara Jodi Ugadi Vibrations

ఎనిమిది రోజుల్లో రిలీజ్ అవబోతున్న దసరా సినిమా ప్రమోషన్స్ లో దూసుకెళ్తుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై బజ్ ఓ రేంజ్ లో ఉంది. ఊహించని విధంగా ఈ సినిమాకు నార్త్ సైడ్ కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఎక్కడ ఈవెంట్ చేసినా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో చిత్ర యూనిట్ ప్రతిరోజు సరికొత్త పోస్టర్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఉగాది సందర్భంగా సినిమా కేవలం ఎనిమిది రోజులే ఉందని చెబుతూ సినిమాలోని హీరో హీరోయిన్  ధరణి వెన్నెలతో పోస్టర్ వదిలారు.దసరా సినిమాలో ధరణి వెన్నెల జోడీ హైలెట్ కానుంది. సినిమాలో ఈ ఇద్దరి నటించిన తీరు కొన్నాళ్ల పాటు ఆడియన్స్ కు గుర్తుండిపోతుందని అంటున్నారు. ఈ తెలుగు సంవత్సరాదిన అందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని దసరా టీం సర్ ప్రైజ్ పోస్టర్ తో వచ్చింది.

ఉగాది రోజున దసరా పండుగ అంటూ నాని ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. దసరా సినిమా ట్రైలర్ చూస్తే సినిమాలో చాలా విషయం ఉన్నట్టు అనిపించింది.

ధరణి పాత్రలో నాని తన విశ్వరూపం చూపించారని తెలుస్తుంది. నాని కెరీర్ లో ఎప్పుడూ ఇంత మాస్ పాత్ర చేయలేదు. ముఖ్యంగా సినిమాలో నాని లుక్ యాస అన్ని చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది.

దసరా సినిమాపై ఆల్రెడీ సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసింది. రిలీజ్ ఇంకా వారం రోజులు మాత్రమే ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నాని అండ్ టీం. ఈ ఈవెంట్ కి రాజమౌళి సుకుమార్ లతో పాటుగా మరో ఇద్దరు స్టార్స్ కూడా వస్తారని తెలుస్తుంది.

నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో.. తన సినీ ప్రస్థానంలో గుర్తుండిపోయే సినిమాగా ఇది వస్తుందని తెలుస్తుంది. మరి నాని అనుకున్న రేంజ్ హిట్ దసరా అందిస్తుందా లేదా అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.