Begin typing your search above and press return to search.

అక్కడ దసరా సందడి కనిపించడం లేదే..

By:  Tupaki Desk   |   1 April 2023 7:40 PM GMT
అక్కడ దసరా సందడి కనిపించడం లేదే..
X
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి నార్త్ ఇండియాలో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. తెలుగు నుంచి వచ్చే సినిమాలలో కథలు బాగుంటాయని నార్త్ బెల్ట్ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నాని దసరా మూవీని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ప్రమోషన్ కూడా నార్త్ లో గట్టిగానే చేశారు.

నాని అయితే అన్ని సిటీస్ వెళ్తూ ప్రజలతో మమేకం అయ్యారు. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అయితే ఎందుకనో నార్త్ బెల్ట్ లో మూవీకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. పుష్ప మూవీకి సాలిడ్ గా ప్రేక్షకాదరణ రావడంతో కచ్చితంగా ఈ మూవీకి కూడా వస్తుందని అంచనా వేశారు.

అయితే అదే రోజు అజయ్ దేవగన్ భోళా సినిమా రిలీజ్ కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆ మూవీ చూడటానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. నాని ఎంత ప్రమోషన్ చేసిన కూడా హిందీ ఆడియన్స్ రీచ్ కాలేదని అర్ధం అవుతుంది. ప్రస్తుతానికి అయితే సినిమాకి నార్త్ ఇండియాలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.

మరి ఈ వీకెండ్ లో మౌత్ టాక్ తో ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా అనేది చూడాలి. పుష్ప, కాంతారా, కార్తికేయ2, సీతారామం సినిమాలు కూడా ప్రమోషన్ ద్వారా కంటే మౌత్ టాక్ ద్వారానే నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని చేరువ అయ్యాయి.

వీకెండ్ పూర్తయిన తర్వాత మెల్లగా కలెక్షన్స్ పుంజుకున్నాయి. మరి దసరా కూడా అలాగే చేరువ అవుతుందా అనేది వీకెండ్ పూర్తయితే క్లారిటీ వస్తుంది.

అయితే తెలుగులో మాత్రం నాని కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని దసరా సొంతం చేసుకోవడం విశేషం. ఇంకా ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి వంద కోట్ల మార్క్ ని కూడా అందుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. భోళా సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో మెల్లగా దసరాకి కలెక్షన్స్ పుంజుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.