దసరా సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉండబోతోందంటే?

Fri Mar 17 2023 13:14:56 GMT+0530 (India Standard Time)

Dasara Censor Report

నేచురల్  స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. తన కెరియర్లోనే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా కావడం... అందులోనూ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని తానై వ్యవహరిస్తూ ఈ సినిమాని కేవలం చెన్నై బెంగళూరు త్రివేండ్రం హైదరాబాద్ ముంబై అని కాకుండా నార్త్లో అనేక ప్రాంతాల్లో ప్రమోట్ చేస్తున్నారు. అలాగే దక్షిణాదిలో కూడా ఇతర సిటీస్ కి కూడా వెళ్లి ప్రమోట్ చేసుకుంటున్నాడు.
 
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఎస్ఎల్వీ శ్రీనివాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది.
 
మార్చి 30వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి డ్యూరేషన్ కూడా ఫిక్స్ అయింది. రెండు గంటల 36 నిమిషాల పాటు ఈ సినిమా సాగబోతోంది. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఒక మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ అని కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద హీట్ అయ్యే సూచనలు ఉన్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు కూడా సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.
 
నాని డీ గ్లామర్ లుక్ లో కనపడుతూ ఉండగా ఆయన సరసన హీరోయిన్ గా  నటించిన కీర్తి సురేష్ కూడా అదే విధంగా కనిపిస్తోంది. ధరణిగా నాని చేసే యాక్షన్ ఫైట్లు సీనిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. కీర్తి సురేష్ నటన సముద్రఖని క్యారెక్టర్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చూస్తే దసరా సినిమా సెన్సార్ రిపోర్టు సినిమా యూనిట్కు మరింత ఊపు వచ్చేసింది. దీంతో మరింత ఉత్సాహంతో సినిమా యూనిట్ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.