దాస్ కా ధమ్కీ రీసౌండ్… వారం రోజుల్లో ఎంతంటే?

Thu Mar 30 2023 22:22:42 GMT+0530 (India Standard Time)

Das Ka Dhamki Resound One Week Collections

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా దాస్ కా ధమ్కీ. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని విశ్వక్ సేన్ సొంత ప్రొడక్షన్ హౌస్ లోనే తెరకెక్కింది. ఇక ఆయన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో మూవీ నిర్మించాడు. మూవీలో డ్యూయల్ రోల్ లో విశ్వక్ నటించడం విశేషం.రెండు భిన్నమైన నేపధ్యాలు ఉన్న క్యారెక్టర్ పోషించి మెప్పించాడు. ఇక కమర్షియల్ సక్సెస్ అందుకోవాలనే విశ్వక్ కోరిక దాస్ కా ధమ్కీ మూవీతో సాధ్యం అయ్యిందని చెప్పాలి. ఇప్పటికే యంగ్ హీరోగా తనకంటూ యునిక్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ కి ఈ సినిమా హీరోగా సక్సెస్ ఇవ్వడంతో పాటు దర్శకుడిగా కూడా అతనిని మరో మెట్టు ఎక్కించింది.

ఇక నిర్మాత కూడా లాభాలు తెచ్చిపెట్టింది. విశ్వక్ కెరియర్ లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా  వన్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ మొదటి వారంలో ఏకంగా 20.80 కోట్ల గ్రాస్ ని మూవీ రాబట్టడం విశేషం.

అంటే ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఎవెన్ కూడా సంపాదించుకొని లాభాల్లో కొనసాగుతుందని తెలుస్తుంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఎవెన్ ని సాధించడం విశేషం. ప్రస్తుతం వచ్చే ప్రతి పైసా లాభంలోనిదే. విశ్వక్ కెరియర్ లోనే ఈ మూవీ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగాను నిలిచింది అని చెప్పాలి.

ప్రస్తుతం థియేటర్స్ లోకి దసరా మూవీ రావడంతో ధమ్కీ  బజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఏది ఏమైన విశ్వక్ కెరియర్ లో హీరోగా సక్సెస్ సాధించిన కమర్షియల్ హీరో ఇమేజ్ తో పాటు బ్లాక్ బస్టర్ ని దమ్కీ మూవీతో అందుకున్నాడు అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.