Begin typing your search above and press return to search.
వీబీవీకె : తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్లు కన్నీళ్లతో..
By: Tupaki Desk | 30 Jan 2023 11:06 AMవిభిన్నమైన సినిమాలతో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం తను నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ య యాక్షన్ డ్రామా 'వినరో భాగ్యము విష్ణుకథ'. ఈ మూవీ ద్వారా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కశ్మీర పర్దేశి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో క్రేజీ ప్రొడక్షన్ కంపనీ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై యువ నిర్మా బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
భలే భలే మగాడివోయ్' నుంచి '18 పేజెస్' విభిన్నమైన కథలతో సూపర్ హిట్ లని దక్కించుకున్న ఈ బ్యానర్ నుంచి వస్తున్న తాజా చిత్రమిది. ఇప్పటి వరకు విడుదలై 'వాసన సువాసన..', 'బంగారం..' లిరికల్ సాంగ్స్ తో పాటు టీజర్ కు విశేష స్పందన లభించింది. తిరుమల తిరుపతి నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమ కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం తాజాగా మరో లిరికల్ వీడియోని విడుదల చేశారు.
'దర్శన..' అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని తాజాగా విడుదల చేశారు. భాస్కర భట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ని ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'మనసే మనసే తననే కలిసే.. అపుడే అపుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా తనతో నడిచే అడుగే మురిసే.. తట్టుకోవడం కాదే పిల్లా నావల్లా వయ్యారి.. దర్శన..దర్శనా తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్లు కన్నీళ్లతో..' అంటూ సాగే పదాలు ఆకట్టుకుంటున్నాయి.
బ్రేకప్ సాంగ్ నేపథ్యంలో ఈ పాట సాగుతుందని తెలుస్తోంది. తన కథని వివరిస్తూ కిరణ్ అబ్బవరం తన లవ్ ని పరిచయం చేస్తూ వచ్చే సందర్భంలో ఈ పాట వుంటుందని తెలుస్తోంది. తన ప్రతీ సినిమాలోనూ ఆడియోకు ప్రధాన ప్రియారిటీ ఇస్తూ వస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా ఆడియోకి కూడా అంతే ప్రియారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అంతే కాకుండా జీఏ2 పిక్చర్స్ కూడా ఈ మూవీ ఆడియో విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్న ఈ మూవీకి విశ్వాస్ సినిమాగ్రఫీని అందిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత బాబు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మురళీశర్మతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.