Begin typing your search above and press return to search.

డ్యాన్సింగ్ క్వీన్ మాధురి ధీక్షిత్ బ‌యోపిక్ లో..?

By:  Tupaki Desk   |   30 July 2021 5:41 AM GMT
డ్యాన్సింగ్ క్వీన్ మాధురి ధీక్షిత్ బ‌యోపిక్ లో..?
X
త‌న‌దైన అందం చందం వ‌య్యారంతో గుబులు రేపుతున్న డ్యాన్సింగ్ క్వీన్ .. మొరాకో బ్యూటీ నోరా ఫ‌తేహి మాధురి ధీక్షిత్ బ‌యోపిక్ పై క‌న్నేసిందా? అంటే అవున‌నే స‌మాచారం. త‌న‌కు డ్యాన్సింగ్ క్వీన్ మాధురి ధీక్షిత్ బయోపిక్ లో నటించాలనుంద‌ని కోరికను నోరా ఓ బ‌హిరంగ వేదిక‌పై వెల్లడించింది. `100 సంవత్సరాల బాలీవుడ్ సెల‌బ్రేష‌న్` ని జరుపుకునే క్రమంలో డ్యాన్స్ రియాలిటీ షోలో నోరా ఫతేహి `డోలా రే డోలా లుక్` ని పునఃసృష్టిస్తూ మాధురి దీక్షిత్ నేనే త‌ర‌హా లుక్ తో క‌నిపించారు. గతంలో కూడా నోరా సీనియర్ నటి బయోపిక్ లో నటించాలనే కోరికను వ్యక్తం చేసింది. ఇక నోరా తాజా లుక్ చూస్తుంటే.. ఆమె అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రూవ్ అవుతోంది.

తన యూట్యూబ్ వ్లాగ్‌ లో నోరా ఫతేహి మాధురి దీక్షిత్ నేనేను కలిసిన తొలి అనుభవాన్ని తొలిసారిగా పంచుకుంది. స‌ద‌రు సీనియర్ నటితో పాటు డాన్స్ రియాలిటీ షోకు కోజ‌డ్జిగా కొన‌సాగుతూ త‌న‌పై అభిమానాన్ని వ్యక్తం చేసిన నోరా బ‌యోపిక్ పైనా ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. మాధురీ దీక్షిత్ బయోపిక్ లో నటించాలనుకున్నందుకు నోరా ఫతేహి తనను తాను నిరాశ‌లో ఉన్న డ్రీమర్ గా పేర్కొంది.

తన ఆలోచనలను పంచుకుంటూ అభిమానులను నోరా అభ్యర్థించింది. అబ్బాయిలు భవిష్యత్తులో నేను మాధురి మేడ‌మ్ బయోపిక్ చేయాలనుకుంటే మీరు ఈ ఫోటోపై వ్యాఖ్యానించండి.. అంటూ మాధురితో క‌లిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. నేను నిరాశ‌గా కలలు కంటున్నాను.. నేను ప్రమాణం చేస్తున్నాను! అంటూ టీజ్ చేసింది మ‌నోహ‌రి.

డ్యాన్స్ రియాలిటీ షోలో `100 సంవత్సరాల బాలీవుడ్` వేడుకలను జరుపుకుంటున్నప్పుడు నోరా ఫతేహి దేవదాస్ నుండి వచ్చిన `డోలా రే డోలా` లుక్ ని ధరించడం ద్వారా మాధురి దీక్షిత్ నేనేపై తన అభిమానాన్ని చాటుకున్నారు. బాలీవుడ్ లో విజయానికి తన మార్గంలో మాధురిని ఒక‌ ప్రేరణగా నోరా ఫతేహి పేర్కొన్నారు. ఇంతకుముందు.. మాధురీ దీక్షిత్ కూడా నోరా ఫతేహిని ప్రశంసలతో ముంచెత్తారు. యువ నటి నోరా ప్రతిభ.. అంకితభావం ..కళ పట్ల మక్కువ గురించి ప్రశంసించారు.

నోరా ఫతేహి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన జనాదరణ పొందిన డ్యాన్స‌ర్ల‌లో ఒకరు.. రికార్డు స్థాయిలో విజయవంతమైన డ్యాన్స్ నంబ‌ర్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించారు. తదుపరి `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో నోరా క‌నిపించ‌నుంది. నోరా ఫతేహి ఈ చిత్రంలో మునుపెన్న‌డూ చూడని అవతారంలో క‌నిపించ‌నుంది.

ఇన్ స్టాలో నోరాకు 3కోట్ల మంది ఫాలోవ‌ర్స్

నోరా ఫతేహి గురువారం నాటికి ఇన్ స్టాగ్రామ్ లో 30 మిలియన్ల (3కోట్లు) మంది ఫాలోవర్లను క‌లిగి ఉన్నారు. ఈ మైలురాయి వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకునేందుకు నోరా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. యానిమల్-ప్రింట్ శాటిన్ బ్రాలెట్ టాప్ మ్యాచింగ్ స్కర్ట్ ధరించిన కొన్ని ఫోటోల‌ను పంచుకుంది. ఈ ఫోటోలలో నోరా హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలను మొరాకోలో క్లిక్ చేశారు. ఆమె తాజా ఫోటోలపై అభిమానులు కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

నోరా బీచ్ లుక్ వ్వావ్ అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఫతేహి బాడీకాన్ శాటిన్ బ్రాలెట్ టాప్ ర్యాప్ క్రాస్ ఓవర్ హాల్టర్-లుక్ తో హాటెస్ట్ గా క‌నిపిస్తోంది. మిడి స్కర్ట్‌.. సెంటర్ స్లిట్ బ్యాక్ జిప్పర్ తో ఆ డిజైన‌ర్ డ్రెస్ లుక్ హీట్ పెంచుతోంది. ఫోటోలలో నోరా ఫతేహి ధ‌రించిన దుస్తులు సాధార‌ణ ధ‌ర‌ల‌తో అందుబాటులో ఉన్నాయి. శాటిన్ బ్రాలెట్ టాప్ ధర రూ .1890 కాగా స్కర్ట్ ధర రూ .3999.