Begin typing your search above and press return to search.

ఆయన నా దేవుడు అంటున్న దగ్గుబాటి హీరో..!

By:  Tupaki Desk   |   30 May 2023 7:00 PM GMT
ఆయన నా దేవుడు అంటున్న దగ్గుబాటి హీరో..!
X
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. అతనే దగ్గుబాటి అభిరామ్. అతను హీరోగా తేజ డైరెక్షన్ లో ఆనంది ఆర్ట్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కించిన సినిమా అహింస. ఈ సినిమా అసలైతే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఏవో కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. జూన్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. రీసెంట్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.

అహింస సినిమా రామానాయుడు గారికి నేనిచ్చిన మాట కోసం చేశానని తేజ అన్నారు. ఇక తేజ డైరెక్షన్ లో నటించడం పట్ల అభిరామ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. తనకు పల్లెటూరి కథల సినిమాలే ఇష్టం. అలాంటి కథల కోసమే ఇన్నాళ్లు ఎదురు చూశానని అన్నారు. అహింస అలాంటి కథే అందరికీ నచ్చుతుందని అన్నారు. తేజ డైరెక్షన్ లో నటించడం తన అదృష్టమని అన్నారు అభిరామ్.

ఆయన దగ్గర పనిచేస్తే మన టాలెంట్ పెరుగుతుంది. తాను ఇప్పుడే కెరీర్ ప్రారంభించగా ఆయన దగ్గర సక్సెస్ అయితే ఎక్కడైనా రాణించవచ్చని అన్నారు . జీరోగా ఉన్న తనని పై లెవల్ కి తీసుకెళ్లారు తేజ.

నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని తేజ కూడా చాలా కష్టపడ్డారు. అందుకే తన దృష్టిలో ఆయన దేవుడు అని అన్నారు అభిరామ్. సినిమా చేస్తున్న టైం లో తనకు ఎన్నో విషయాలు నేర్పించారని అన్నారు.

ఇక తనని ఇంటి పేరు బట్టి గురించకుండా నటనను బట్టి గుర్తింపు ఇవ్వాలని అంటున్నారు అభిరామ్. టాప్ ప్రొడ్యూసర్ తనయుడిగానో.. రానా తమ్ముడిగానో తనని గుర్తించ వద్దు. అహింసలో తన తన నటన చూసి ఆదరించండని అంటున్నాడు. అన్ని విషయాల్లో బ్యాక్ గ్రౌండ్ పనిచేయదని అన్నారు అభిరామ్. సినిమా చూశాక ఇంట్లో వాళ్లంతా మెచ్చుకున్నారు వెంకటేష్ గారు కొన్ని సూచనలు ఇచ్చారని చెప్పారు అభిరామ్.

అహింస సినిమా లో అభిరామ్ సరసన గీతిక హీరోయిన్ గా నటించింది. సదా కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ప్రేమ కథల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న తేజ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని తేజ అహింసతో మరోసారి తన మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు. దగ్గుబాటి వారసుడి మొదటి సినిమాగా వస్తున్న అహింస ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.