Begin typing your search above and press return to search.

ఆకు చాటు అందం.. డ‌బూ కౌంట‌ర్ ఇదిగో

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:30 AM GMT
ఆకు చాటు అందం.. డ‌బూ కౌంట‌ర్ ఇదిగో
X
బాలీవుడ్ సెల‌బ్రిటీ ఫోటోగ్రాఫ‌ర్ డ‌బూ ర‌త్నానీపై సోష‌ల్ మీడియా పంచ్ ల గురించి తెలిసిందే. కేలెండ‌ర్ గాళ్ కియరా స్టిల్ రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌ద‌రు యంగ్ బ్యూటీ ప‌చ్చ‌టి ఆకును అడ్డుగా పెట్టుకుని ఇచ్చిన‌ టాప్ లెస్ ఫోజు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. 2020 క్యాలెండ‌ర్ భామ వేడెక్కించింది. కియ‌రా ఫోజును చూసిన నెటిజ‌నులు ఆరంభం డ‌బు ర‌త్నాని క్రియేటివీటీ అసాధార‌ణం.. అద్భుతం అంటూ తెగ పొగిడేసారు. అయితే అంతే వేగంగా కాపీ క్యాట్ అన్న విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి.

అత‌ను క్రియేట‌ర్ కాదు....కాపీ క్యాట్!! అంటూ నెటిజ‌నులు కియారా అద్వాణీ ఫోజులో ఉన్న మ‌రో పిక్ ను చూపిస్తూ ట్రోల్ చేసారు. అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ మేరీ బార్ష్ ఫోటో షూట్ తో కియారా ఇచ్చిన పోజులు పోలికలు ఉన్నాయి. దీంతో డ‌బు అడ్డంగా దొరికిపోయి అక్షింత‌లు వేయించుకున్నాడు. అయితే అంత‌గా ఆవేశ ప‌డ‌కండి..ఎవ‌రు కాపీ క్యాట్ అన్న‌ది తేలుస్తాను! అంటూ ఆ ఫోటోకి ఓ సాక్ష్యాన్ని చూపించాడు. ఇదే స్ఫూర్తి అంటూ సేమ్ డిజైన్ లో ఉన్న మ‌రో ఫోటోను షేర్ చేసాడు.

2002 లో ఆ ఫోజును క్రియేట్ చేసింది డ‌బూనే. అప్ప‌ట్లో క్యాలెండ‌ర్ గాళ్ అయిన‌ వెట‌ర‌న్ హీరోయిన్ ట‌బుని త‌న కెమెరా లో ఎలా బంధించింది వివ‌ర‌ణ ఇచ్చాడు. అందులో ట‌బు కూడా టాప్ లెస్ గా ఫోజులిచ్చింది..మ‌ధ్య‌లో ప‌చ్చి కొబ్బ‌రాకుల మ‌ట్ట‌ను అడ్డు గా పెట్టుకుని క‌నిపిస్తుంది. ఆ క్రియేటివిటీ త‌న‌కు మాత్ర‌మే సొంత‌మ‌ని.. త‌న‌ను ట్రోల్ చేసిన వాళ్ల‌కి... విమ‌ర్శించిన వాళ్ల‌కి త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చాడు. సందేశంతో కూడుకున్న ఎమోజీలను షేర్ చేసి స‌మాధానం ఇచ్చాడు.