Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ బ్ర‌ద‌ర్స్ నా భార్య‌ను రేప్ చేస్తామ‌ని బెదిరించారు!

By:  Tupaki Desk   |   17 Jun 2020 8:10 AM GMT
స‌ల్మాన్ బ్ర‌ద‌ర్స్ నా భార్య‌ను రేప్ చేస్తామ‌ని బెదిరించారు!
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య బాలీవుడ్ లో ప్ర‌కంప‌నాలు రేపుతోంది. ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ర‌క‌ర‌కాల జాడ్యాల్ని బ‌య‌ట‌పెడుతోంది. ప‌రిశ్ర‌మ‌లో మాఫియాని అక్క‌డ రాజ‌కీయాల్ని బ‌హిర్గ‌తం చేస్తోంది. ఇన్నాళ్లు దాగి ఉన్నఎన్నో న‌గ్న స‌త్యాల్ని ఆవిష్క‌రిస్తోంది ఈ ఉదంతం. సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంతా ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌ప‌డుతున్నారు. ట్వీట్లు స‌హా మీడియా ఇంట‌ర్వ్యూల్లో క‌ల‌క‌లం రేపే ఎన్నో నిజాల్ని బ‌య‌ట పెట్ట‌డం షాక్ నిస్తోంది.

తాజాగా ఇండ‌స్ట్రీ రాజ‌కీయాల్ని ప్ర‌స్థావిస్తూ సుశాంత్ సింగ్ లా వేటికీ భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని ద‌బాంగ్ ద‌ర్శ‌కుడు అభిన‌వ్ క‌శ్య‌ప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప‌రిశ్ర‌మలో బెదిరింపుల ఫ‌ర్వాన్ని కూడా ఆయ‌న తెర‌పైకి తెచ్చి స‌ల్మాన్ సోద‌రుల నుంచి త‌న‌కు ఎదురైన అనుభవాన్ని చెప్పుకుని ఆవేద‌న చెందారు.

స‌ల్మాన్ సోద‌రుడు సోహైల్ ఖాన్ స‌హా కుటుంబ స‌భ్యులు త‌న‌ను త‌న కుటుంబాన్ని చంపేస్తామ‌ని బెదిరించార‌ని .. త‌మ ఇళ్ల‌లో ఆడాళ్ల‌ను రేప్ చేస్తామ‌ని బెదిరించార‌ని ఆరోపించారు. త‌న భార్య‌ను రేప్ చేస్తామ‌ని స‌ల్మాన్ సోద‌రులు హెచ్చ‌రించ‌డం వ‌ల్ల ఆ త‌ర్వాత కుటుంబంలో క‌ల్లోలం చెల‌రేగింద‌ని అభిన‌వ్ తెలిపారు. త‌న భార్య నుంచి విడిపోవ‌డానికి స‌ల్మాన్ సోద‌రుల బెదిరింపులే కార‌ణ‌మ‌ని అన్నారు. ఈ బెదిరింపుల వ్య‌వ‌హారంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే కేసు న‌మోదు చేయ‌లేద‌ని ఆరోపించారు. ఎన్నోసార్లు వెంటాడి వేధించారు. బెదిరించారు. ప్ర‌తిసారీ పోలీసుల‌కు ఆధారాలు చూపించాను. బెదిరింపు మెసేజ్ లు చూపించాను. కానీ పోలీసులు కేసు న‌మోదు చేయ‌లేదు. చేయకుండా స‌ల్మాన్ కుటుంబీకులు నిలువ‌రించారు.. అంటూ అభిన‌వ్ తీవ్రంగా ఆరోపించారు.

త‌న‌ని ప‌రిశ్ర‌మ నుంచి అంతం చేయాల‌ని.. త‌రిమేయాల‌ని స‌ల్మాన్ కుటుంబం కుట్ర చేసిన‌ట్టు ఆరోపించారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నా కుటుంబంలో క‌ల‌త‌లు ఎదురై మాన‌సికంగా తీవ్ర ఇబ్బందికి గుర‌య్యాన‌ని అభిన‌వ్ తెలిపారు. ఒక‌సారి పోలీసులు ఏదో కేసు పెట్టి మ‌మ అనిపించారు త‌ప్ప స‌రిగా విచారించ‌లేద‌ని ఆవేద‌నను వ్య‌క్తం చేశారు. ప‌దేళ్లుగా దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు స‌ల్మాన్ ఫ్యామిలీ ప్ర‌య‌త్నించింది. 2017లో వ‌రుస ఇన్సిడెంట్లను వివ‌రించారు అభిన‌వ్. సాక్ష్యాధారాలు స‌హా అన్నీ ఉన్నా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆవేద‌న చెందారు. నా పోస్టును సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేసి నిజాల్ని బ‌య‌ట‌కు చెప్పండ‌ని నెటిజ‌నుల్ని కోరారు అభిన‌వ్. ద‌బాంగ్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అభిన‌వ్ తో స‌ల్మాన్ విబేధాల గురించి తెలిసిందే.