లిప్ లాక్ తో 'డీజే టిల్లు' కొత్త రిలీజ్ డేట్ లాక్..!

Fri Jan 28 2022 17:04:52 GMT+0530 (India Standard Time)

DJ Tillu Release Date

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ - కుర్ర భామ నేహాశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ''డీజే టిల్లు''. 'అట్లుంటది మనతోని' అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ యూత్ ఫుల్ హిలేరియస్ ఎంటర్టైనర్ తో విమల్ కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారు.''డీజే టిల్లు'' చిత్రాన్ని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. యూత్ ని ఆకట్టుకునే టీజర్ మరియు పాటలు ఈ సినిమాపై మంచి బజ్ ని క్రియట్ చేశాయి. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ విభిన్న పాత్రలో విలక్షణమైన హైదరాబాదీ యాసలో ప్రేక్షకులను అలరించారు. నేహా శెట్టి టీజర్ తో పాటు పాటల్లోనూ గ్లామరస్ గా కనిపించింది.

ప్రిన్స్ సిసిల్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ - స్క్రీన్ ప్లే కూడా రాశారు. ఇందులో డైలాగ్స్ కూడా సిద్ధునే అందించడం విశేషం. శ్రీచరణ్ పాకాల - రామ్ మిరియాల సంగీతం సమకూర్చగా.. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు.

'డీజే టిల్లు' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ధీరజ్ మొగిలినేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పోటీ లేకుండా రిలీజ్ అవుతున్న ఈ విలక్షణమైన ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.