బ్లాక్ బస్టర్ రా బాంచెత్.. ఏందయ్యా ఇది..!

Sat Apr 01 2023 11:02:17 GMT+0530 (India Standard Time)

'DASARA' Movie Blockbuster Raa Bancheth

ఓ సినిమా హిట్టు కొడితే ఆ హీరోకి ఎంత జోష్ ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమా సినిమాకు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్న 2 టైర్ హీరోల్లో ఏ సినిమాకు ఆ సినిమాతో సత్తా చాటాలని చూస్తుంటారు.ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని దసరా సినిమాకు ముందు సినిమాతో కెరీర్ లో నిలిచి పోయే హిట్ కొడతా అని చెప్పేశాడు. ఫైనల్ గా సినిమా వచ్చి ధరణి పాత్రలో నానిని అందరు యాక్సెప్ట్ చేశారు. నానిని ఇలా మాస్ లుక్ లో చూసిన ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

అయితే సినిమా హిట్ కొడితే ఓకే కానీ ఆ జోష్ లో ఏం పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాం అన్నది చూసుకోవాలి. ఎందుకంటే దసరా లేటెస్ట్ పోస్టర్ కొందరిని ఇబ్బంది పెడుతుంది. ఇంతకీ ఆ పోస్టర్ ఏంటి అంటే బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అని వేశారు.

సినిమా హిట్టు కొట్టారు ఓకే కానీ ఆ సినిమాలో హీరో భాషతో పోస్టర్ వేయడం మాత్రం అంతగా బాగాలేదని అంటున్నారు. బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అంటే ఇది ఎవరిని అంటున్నట్టు.. ఎవరికి చెబుతున్నట్టు అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు.

సినిమా సక్సెస్ అందుకోవడం వరకు బాగానే ఉన్నా ఇలా సినిమాలోని పాత్ర స్వభావం పోస్టర్స్ లో కనిపించేలా.. వినిపించేలా చేయడం మాత్రం అంత మంచిది కాదని చెప్పొచ్చు.

బ్లాక్ బస్టర్ వరకు ఓకే కానీ రా బాంచెత్ అంటూ ఇది ఎవరికో చెబుతున్నట్టుగా పోస్టర్ పై వివాదం మొదలైంది. ఇక దసరా సినిమా వసూళ్ల లెక్కకు వస్తే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా నాని దసరా దూసుకెళ్తుంది.

సినిమాలో నానితో పాటుగా కీర్తి సురేష్ రోల్ కూడా అదరగొట్టేసింది. సినిమాను ముందు నుంచి బీభత్సంగా ప్రమోట్ చేస్తూ వస్తున్న నాని తను ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ అవడం థ్రిల్ అనిపిస్తుంది. ఈ సినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన నాని అక్కడ కూడా ప్రేక్షకులను అలరించినట్టే ఉన్నారు.