2వ రోజు తగ్గిన దసరా కలెక్షన్లు.. ఏం జరుగుతోంది?

Sat Apr 01 2023 13:00:07 GMT+0530 (India Standard Time)

DASARA Movie 2nd Day Collections

నాని కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా ఏ  రేంజ్ లో రిలీజ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ టాక్ సాధించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ అని టాక్ రాకపోవడం గమనార్హం. మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. రెండో రోజునే వసూళ్లు తగ్గడం షాక్ కు గురి చేస్తోంది. వీకెండ్స్ లో విపరీతమైన కలెక్షన్లను రాబట్టాల్సి ఉండగా... వసూళ్లు తగ్గడంతో సినిమా తక్కువ రోజేలే ఆడుతుందేమోనని అంతా అనుకుంటున్నారు. అసలు రెండో రోజే ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధించాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో దసరా 2వ రోజు మొత్తంగా రూ.5.86 కోట్లు వసూలు చేసింది.

నైజాంలో రూ.3.48 కోట్లు

సీడెడ్ లో రూ.66 లక్షలు

ఉత్తరాంధ్ర రూ.64 లక్షలు

ఈస్ట్ రూ.28 లక్షలు

వెస్ట్ రూ.16 లక్షలు

గుంటూరు రూ.24 లక్షలు

కృష్ణ రూ.28 లక్షలు

నెల్లూరు రూ.12 లక్షలు

నాని దసరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. రెండ్రోజుల మొత్తం కలెక్షన్లు రూ.20.08 కోట్లు కాగా రూ.34.45 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

నైజాంలో రూ.10.26 కోట్లు

సీడెడ్ రూ.3.02 కోట్లు

ఉత్తరాంధ్ర రూ.2.06 కోట్లు

ఈస్ట్ రూ.1.18 కోట్లు

ఈస్ట్ రూ.71 లక్షలు

గుంటూరు రూ.1.46 కోట్లు

కృష్ణ రూ.92 లక్షలు

నెల్లూరు రూ.47 లక్షలు

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.2.15 కోట్లు ఇతర భాషల్లో రూ.65 లక్షలు ఉత్తర భారత దేశంలో రూ.60 లక్షలు ఓవర్సీస్ లో రూ.5.60 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 29.08 కోట్లు వసూళ్లు రాబట్టింది. రూ.52.40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమా మొత్తం వ్యాపారం రూ.48 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ రూ.49 కోట్లుగా ఫిక్స్ అయింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.19.92 కోట్లు వసూలు చేయాలి.

అయితే రెండో రోజే వసూళ్లు భారీగా తగ్గతడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వీకెండ్ అయినా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్లు రాబట్టకపోవడం... అందులోనూ ఇతర రాష్ట్రాల్లో ఏమాత్రం కలెక్షన్లు సాధించకపోవడంతో సినిమా పరిస్థితి ఏంటా అని అనుకుంటున్నారు. ఏ సినిమా అయినా శని ఆది వారాల్లోనే ఎక్కువ కలెక్షన్లు రాబడుతుంది. వీకెండ్ అనంతరం సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందనుకోవడం గాల్లో దీపం పెట్టి దేవుడికి మొక్కినట్లే అని ట్రేడ్ పంతుల్లు చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో.