Begin typing your search above and press return to search.

డి-కంపెనీ ట్రైలర్ టాక్: మరోసారి వర్మ మార్క్ హింస - రక్తపాతం - కామం!

By:  Tupaki Desk   |   5 March 2021 12:39 PM GMT
డి-కంపెనీ ట్రైలర్ టాక్: మరోసారి వర్మ మార్క్ హింస - రక్తపాతం - కామం!
X
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎల్లప్పుడూ ఏదొక వివాదం లేకుండా ఉండలేడు. అందుకే సినిమాలు, ట్వీట్స్ రూపంలో వివాదాలకు తెరలేపుతుంటాడు. వివాదాస్పద సినిమాలు రూపొందించడంలో వర్మ పెట్టింది పేరు. ఈ మధ్యకాలంలో వర్మ చేసిన సినిమాల‌న్నీ వివాదాల్లో చిక్కుకుని వరుసగా పరాజయం పాలయ్యాయి. కానీ పరాజయాల ప్రభావం వర్మ అసలు పట్టించుకోడు అనేది అందరికి తెలిసిందే. లాక్ డౌన్ టైంలో భిన్నమైన సస్పెన్స్ సినిమాలతో ప్రేక్షకుల‌ను పలకరించిన వర్మ. ఇప్పుడు మరోసారి వివాదం రేపేందుకు రెడీ అయిపోయాడు. వర్మకు అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పై సినిమా తీయాలనేది డ్రీమ్ అంటూ పలుమార్లు సోషల్ మీడియాపరంగా ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

అదే ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో డి-కంపెనీ అనే సినిమా రూపొందించాడు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. ట్రైలర్ చూస్తే మరోసారి వర్మ.. తన మార్క్ క్రైమ్, రక్తపాతం, లస్ట్ తో కూడిన అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2002లో రాంగోపాల్ వర్మ కంపెనీ అనే పేరుతో సినిమా తీసాడు. ఆ సినిమా మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఇన్నేళ్లకు మళ్లీ 2021లో ఈసారి ముంబై అండర్ వరల్డ్ మాఫియాను చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. తాజాగా ఆర్జీవి డి-కంపెనీ ట్రైలర్ రిలీజ్ చేసాడు. ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే.. డి-కంపెనీ ఓపెనింగ్ నుండి మాఫియాకు మనల్ని పరిచయం చేస్తోంది.

1980లో జరిగిన మాఫియా చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. హీరో క్యారెక్టర్ లోనే అన్ని వెరియేషన్స్ చూపించే ప్రయత్నం చేశాడు. అతను ఎల్లప్పుడూ కోపంగా, పొగతాగుతూ.. లేదా ఎవరో ఒకర్ని మర్డర్ చేస్తూ కనిపిస్తాడు. ఖాళీగా ఉంటే మాత్రం అమ్మాయిలను కామంతో వేదిస్తున్నట్లు వర్మ తన స్టైల్ లో చూపించాడు. ఇందులో హింస, లైంగిక వేధింపులతో పాటు ఇంటరెస్టింగ్ డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్జీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సినిమా దావుద్ ఇబ్రహీం నేతృత్వంలో ముంబైలో జరిగిన మాఫియా సాగా అంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను స్పార్క్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాగర్ మంచనూరు నిర్మిస్తుండగా.. మార్చ్ 26న సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.