ఫోటో స్టొరీ: సీక్రెట్ ఆఫ్ హాట్ నెస్ ఇదే

Tue Apr 23 2019 15:44:20 GMT+0530 (IST)

Cute Lady Stretching Her Leg

మాస్ మహారాజా రవితేజ సినిమా 'నేల టికెట్' తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మాళవిక శర్మ.  ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది కానీ ఈ ముంబై భామ మాత్రం తన గ్లామర్ షో విషయంలో ఫుల్ మార్క్స్ తెచ్చుకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ సినిమాను ఎక్కువ మంది చూడలేదు అందుకే వారికి మాళవిక ప్రతాపం తెలియలేదు. అసలే ముంబై భామ.. సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో ఇన్స్టాగ్రామ్ నుండి పబ్లిసిటీ ఎలా పిండుకోవాలో ఫుల్ నాలెడ్జ్ ఉంది.అందుకే రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్లను ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.  కొన్ని సార్లు తన హాట్ ఫోటో షూట్లతో నెటిజనులు అవాక్కయ్యేలా చేస్తుంది. లక్షల కొద్ది లైకులు సాధిస్తుంది.  ఈ ట్రెండుకు కంటిన్యూ చేసేందుకు సోమ మంగళవారాలు ఆమెకు అడ్డేమీ కావు. తాజాగా జిమ్ములో కఠినమైన కసరత్తులు చేస్తూ ఉన్న ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు 'పైలేట్స్' అనే క్యాప్షన్ ఇచ్చింది. పైరేట్స్ అనే పదానికి సిమిలర్ గా అనిపిస్తున్నప్పటికీ ఈ పదానికి బోలెడు అర్థం ఉంది. పైలేట్ ఎక్సర్ సైజు అంటే కార్డియో ప్లస్ స్త్రెంగ్త్ ఎక్సర్ సైజులు.  ఊరికే వెయిట్స్ ఎత్తుతూ కండలు పెంచడం మాత్రం కాకుండా ఓవరాల్ ఫిట్నెస్ ను మెరుగుపరుచుకునే విధానం. ఆ విధానంలో ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫోటోనే పైన ఉండేది.

బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టీ షర్ట్.. బ్లాక్ మినీ షార్ట్ తో రెండు చిన్న సైజు డంబెల్స్ చేతబట్టి సీరియస్ గా ఎక్సర్ సైజ్ చేస్తూ ఉంది. ఈ ఫోటోలో సీరియస్ ఎక్స్ ప్రెషన్ తో ఉన్నప్పటికీ హాట్ నెస్ కూడా ఉంది.  టోన్డ్ గా ఉన్న లెగ్స్.. మిల్లీ గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా ఉండే మాళవికను చూసి నెటిజనులు సూపర్ కామెంట్లు పెట్టారు. ఒకరు "సీక్రెట్ ఆఫ్ హాట్ నెస్" అన్నారు. మరొకరు శభాష్ మాళవిక అని మెచ్చుకున్నారు. నిజమే.. ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోకు వెనక ఇలాంటి ఇంటెన్స్ ఎక్సర్ సైజులు ఉంటాయి మరి. ఊరికే ఫిట్నెస్.. గ్లామర్ రాదు కదా?