కస్టడీ టీజర్... నిజమనే సైన్యంతో చై యాక్షన్!

Thu Mar 16 2023 17:48:19 GMT+0530 (India Standard Time)

Custody Teaser Naga Chaitanya Krithi Shetty

అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జోష్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈయన.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అయితే తాజాగా ఆయన నటించిన కస్టడీ సినిమా టీజర్ రిలీజ్ అయింది. 'గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది' లాంటి సూపర్ పవర్ ఫుల్ డైలాగ్ తో ఈ టీజర్ వచ్చేసింది. నాగ చైతన్య వెంకట్ ప్రభూ కాంబినేషన్ లో వస్తున్న తెలుగు తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ. ఇందులో కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు చైతూ. తాజాగా ఈ మూవీ టీజర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా టీజర్ కట్ చేశారు.'నిజం ఒక ధైర్యం నిజం ఒక సైన్యం యస్.. ద ట్రూత్ ఇజ్ ఇన్ మై కస్టడీ' అంటూ నాగ చైతన్య నోటి వెంట వచ్చిన పలు డైలాగ్స్ తో మూవీపై అంచనాలు పెరిగాయి. మరోసారి చైతూ తన నటనతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే 'కస్టడీ' మూవీ నుండి విడుదల అయిన గ్లింప్స్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడు రిలీజ్ అయిన 'కస్టడీ' టీజర్ కూడా అదిరిపోవడంతో అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. తాను నటించే ప్రతి పాత్ర భిన్నంగా గత సినిమాలకంటే కొంత ఛాలెంజింగ్ గా ఉండేలా చూసుకుంటున్నాడు చైతూ. 'కస్టడీ' మూవీలో ఈ పాత్రను చూస్తే అలాగే అనిపిస్తోంది.

టీజర్ తో మేకర్స్ సినిమా మేయిన్ ప్లాట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడే కరుడు గట్టిన ఒక రౌడీ.. తననెవరూ ఏమీ చేయలేరని విశ్వాసం.. అలాంటి గూండాకు వ్యతిరేకంగా హీరో చేతికి దొరికిన నిజం.. దాంతో హీరో ఎలా ఆ రౌడీ ఆట కట్టించాడనేది అసలైన కథలా కనిపిస్తోంది. ఈ మూవీని పక్కా కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

లవ్ స్టోరీ బంగార్రాజు లాంటి హిట్లు అందుకున్న తర్వాత నాగ చైతన్య నుండి వచ్చిన థ్యాంక్యూ మూవీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో చైతూ సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకుని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో 'కస్టడీ' మూవీ చేస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.