Begin typing your search above and press return to search.

'#PSPK28' ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   4 May 2021 2:30 AM GMT
#PSPK28 ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'గబ్బర్ సింగ్' సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ కాంబోలో మరో మూవీ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. '#PSPK28' అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదంటూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసాడు హరీష్. 'ఇప్పుడే మొదలైంది' అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచిన హరీష్.. గతేడాది నుంచి ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి ఫైనల్ డ్రాఫ్ట్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. హరీష్ శంకర్ ఈ సినిమా క్యాస్టింగ్ పనులు కుడా స్టార్ట్ చేసారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇకపోతే వినోదంతో పాటుగా సోషల్ మెసేజ్ కూడా ఉండేలా ఈ సినిమాకి రెడీ చేస్తారని తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ గెటప్, లుక్స్ కొత్తగా ఉంటాయని.. హరీష్ తరహా వన్ లైన్ డైలాగ్స్‌ పై ప్రత్యేక శ్రద్ధ ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కు 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ పక్కా మరో బ్లాక్ బస్టర్ ఇస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు.

కాగా, '#PSPK28' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ.. రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కోవిడ్ పరిస్థితులు చక్కబడితే వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు.