దళపతితో స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా స్కెచ్

Wed Jun 29 2022 08:00:01 GMT+0530 (IST)

Crazy Update On Vijay Lokesh Kanagaraj Movie

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `విక్రమ్`. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత కమల్ నుంచి వచ్చిన ఈ మూవీ ఊహించని స్థాయిలో రికార్డులు తిరగరాస్తూ కమల్ కెరీర్ లోనే రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ నటించి నిర్మించిన ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ. 100 కోట్ల మార్కుని దాటేసి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది.ఈ మూవీ సాధిస్తున్న విజయానందంలో వున్న కమల్ హాసన్ చిత్ర దర్శకుడికి టీమ్‌కి కానుకల వర్షం కురిపించారు. హీరో సూర్య ఈ మూవీలో రోలెక్స్ గా అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్రలో నటించినందుకు గాను హీరో సూర్యకు కమల్ రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా అందించి తన ఆనందాన్ని పంచుకున్నారు. అంతే కాకుండా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో `విక్రమ్`కు సీక్వెల్ గా `విక్రమ్ 3`ని చేస్తానని ప్రకటించారు కూడా.

ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఓ భారీ గ్యాంగ్ స్టర్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటికి కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. విజయ్ తో చేయబోతున్న ఈ మూవీ ముంబై నేపథ్యంలో ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది.

ఎంటైర్ మూవీ అంతా ముంబై నేపథ్యంలోనే సాగనుందని ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి చేరిన ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలిసింది. అంతే కాకుండా ఈమూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలోని కీలక పాత్రల కోసం పేరున్న బిగ్ స్టార్స్ ని దర్శకుడు సంప్రదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారట.