'పుష్ప' స్టార్ చేతిలో మరో బిగ్ ప్రాజెక్ట్

Thu Apr 08 2021 13:00:02 GMT+0530 (IST)

Crazy Offers For Pushpa Villain

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటించబోతున్న స్టార్ విలన్ ఎవరు ఎవరు అంటూ ఏడాది పాటు వెయిట్ చేసిన తర్వాత మలయాళ స్టార్ ట్యాలెంటెడ్ హీరో ఫహాద్ ఫాజిల్ ను ఎంపిక చేయడం జరిగింది. పుష్ప సినిమా రేంజ్ ను ఈయన ఖచ్చితంగా పెంచుతాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ కేవలం మలయాళ నటుడు మాత్రమే కాదు. తన నటనతో పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న స్టార్. అందుకే ఈయన చేతికి మరో బిగ్ ప్రాజెక్ట్ వచ్చిందని తమిళ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఫహాద్ ఫాజిల్ తమిళంలో ఒక బిగ్ ప్రాజెక్ట్ లో ఓకే అయ్యాడని గత కొన్నాళ్లుగా వార్తలు అయితే వచ్చాయి. తాజాగా ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది.యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'విక్రమ్'. ఈ సినిమా లో విలన్ పాత్రను ఫహాద్ ఫాజిల్ ను ఎంపిక చేశారట. త్వరలోనే ఆయన షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే మలయాళంలో స్టార్ గా గుర్తింపు దక్కించుకుని తన ప్రతిభతో అవార్డులు రివార్డులతో పాటు ప్రేక్షకుల అభిమానంను దక్కించుకున్న ఫహాద్ ఇప్పుడు పలు భాషల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

పుష్ప సినిమాలో విజయ్ సేతుపతి ని ఎంపిక చేసిన పాత్రకు గాను ఫహాద్ ను ఎంపిక చేయడం జరిగింది. షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. ఆ పాత్రను ఖచ్చితంగా ఫహాద్ అయితేనే న్యాయం చేసేలా నటిస్తాడనే నమ్మకంతో సుకుమార్ ఈయన్ను ఎంపిక చేయడం జరిగింది. ఇక కమల్ హాసన్ ప్రతిష్టాత్మక మూవీ విక్రమ్ లో కూడా కీలకమైన పాత్ర కు ఫహాద్ చక్కగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఈ సినిమాలో లోకేష్ కనగారాజ్ ఆయన్ను ఎంపిక చేశాడంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.