Begin typing your search above and press return to search.

క్రేజీ మ‌నోహ‌రి 4కోట్ల మందికి నిరంత‌ర ట్రీట్

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:00 PM GMT
క్రేజీ మ‌నోహ‌రి 4కోట్ల మందికి నిరంత‌ర ట్రీట్
X
సోష‌ల్ మీడియాలో 4కోట్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్న క్రేజీ తార‌గా నోరా ఫ‌తేహి రేంజ్ స్కైని ట‌చ్ చేస్తోంది. నటి- మోడల్- డ్యాన్సర్- గాయని గా రాణించిన నోరా ఫతేహికి బాహుబ‌లి మ‌నోహ‌రిగా అద్భుత గుర్తింపు అభిమానం ద‌క్కాయి. ఫిబ్రవరి 6 తో నోరాకు 31 ఏళ్లు నిండాయి. ఇన్ స్టాగ్రామ్ స్టార్ గా చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ‌ తన ట్రెండింగ్ ఫోటోషూట్లు- రీల్స్ క్రియేష‌న్ తో నిరంత‌రం యువ‌త‌రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

నోరా ఇటీవల మారిషస్ లో విజ్ కిడ్ - క్రిస్ బ్రౌన్స్ హిట్ 'కాల్ మి ఎవ్రీ డే'కి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో బీచ్ లో కొరియోగ్రాఫర్ రజిత్ దేవ్ - మేకప్ ఆర్టిస్ట్ మార్స్ పెడ్రోజోతో కలిసి బ్లాస్టింగ్ ఫోటోషూట్ లో పాల్గొంది.

అప్ప‌టి నుంచి బీచ్ నుంచి స్పెష‌ల్ షూట్ల‌కు సంబంధించిన గ్లింప్స్ ని నోరా షేర్ చేస్తుంటే అవి ఇట్టే వైర‌ల్ అయిపోతున్నాయి. తాజాగా షేర్ చేసిన నియాన్ క‌ల‌ర్ థై స్లిట్ ఫ్రాక్ యువ‌తం గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. నోరా అలా బీచ్ లో సొగ‌సుగా హొయ‌లు పోతుంటే యూత్ క‌ళ్లు తిప్పుకోడం క‌ష్టంగా ఉందంటే అతిశ‌యోక్తి కాదు. 40 మిలియన్ల మంది ఫాలోవర్లతో సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉన్న నోరా నిరంత‌రం సొగ‌సైన ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.

4కోట్ల మంది అభిమానుల‌కు ఇది వెర్రి! ఇంత‌ ఫామ్ కు చేరుకుంటాన‌ని ఎవరు భావించారు ! మేం ఎక్కడికీ వెళ్లడం లేదు!! అభిమానం పెరుగుతూనే ఉంది. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో వినయంగా ఉంటాను! నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తదుపరి 100 మిలియన్ల క్ల‌బ్ తో క‌లుద్దాం'' అని వ్యాఖ్యానించింది. #Dancewithnora #ప్రపంచవ్యాప్తంగా అంటూ హ్యాష్ ట్యాగుల‌ను జోడించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.