Begin typing your search above and press return to search.

శుభ‌మా అని రిలీజ్ కొస్తుంటే ఏంటిది రాజా?

By:  Tupaki Desk   |   22 Nov 2020 4:50 PM GMT
శుభ‌మా అని రిలీజ్ కొస్తుంటే ఏంటిది రాజా?
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌- శ్రుతి హాసన్ నటించిన క్రాక్ సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానుంద‌ని ప్ర‌చార‌మవుతోంది. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే.. క్రాక్ చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది.

వివరాల్లోకి వెళితే,.. ఠాగూర్ మధు ఏడాదిన్నర క్రితం నిర్మించిన అయోగ్య (టెంప‌ర్ తమిళ రీమేక్ ) చిత్రానికి సంబంధించిన వివాద‌మిది. అయోగ్య మొదట 10 మే 2019 న విడుదల కావాల్సి ఉంది. అయితే ఒక ప్రముఖ పంపిణీదారు ఈ మూవీ తమిళనాడు హక్కులను 11 కోట్ల కనీస హామీ (తిరిగి చెల్లించని) ప్రాతిపదికన పొందారు. మే 10 న థియేటర్లలో కి రావాలంటే ఆర్ధిక బకాయిలను క్లియర్ చేయాల్సి ఉండ‌గా నిర్మాత విఫలమయ్యారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా విడుదల కావాలంటే నిర్మాత పంపిణీదారుని 5కోట్లు ఎక్కువ చెల్లించాలని కోరారు. 16 కోట్ల మేర డీల్ కి సంబంధించిన స‌మ‌స్య అది. దీనికి అడ్వాన్స్ ప్రాతిపదికన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంటే సినిమాకు ఏదైనా నష్టం ఉంటే నిర్మాత మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి పంపిణీదారు. ఈ చిత్రం చివరకు ఒక రోజు తరువాత మే 11 న విడుదలైంది. ప్రేక్షకుల నుండి చ‌క్క‌ని స్పందనను పొందింది. 8 కోట్ల మేర‌ పంపిణీదారు వాటాను వ‌సూలు చేసినా బంప‌ర్ హిట్ కాలేదు.

అప్ప‌టికి పంపిణీదారు చెల్లించిన మొత్తంలో సగం మాత్ర‌మే వ‌సూలైంది. ఒప్పందంలో భాగంగా నిర్మాత ఇంకా మిగిలిన డబ్బును తిరిగి ఇవ్వాలి. ఇది ఇప్పటికే ఒక సంవత్సరం అయ్యింది. ఇప్పుడు పంపిణీదారుడు ఠాగూర్ మ‌ధునే నిర్మించిన `క్రాక్` చిత్రానికి స్టే ఇవ్వమని కోర్టును ఆశ్రయించారు. మిగిలిన మొత్తాన్ని మధు చెల్లించే వరకు స్టే కొన‌సాగుతుంది. మునుపటి చిత్రం అర్జున్ సువరం కూడా ఆర్థిక సమస్యల కారణంగా చాలా ఆలస్యంగా విడుదలైంది. కానీ ఈ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకుని క్రాక్ ని రిలీజ్ చేస్తారా? అన్న‌ది చూడాలి.