వారంతా స్పీడ్...బన్నీయే లేట్... ?

Sun Dec 05 2021 23:00:01 GMT+0530 (IST)

Countdown to the Pushpa release has begun

అల్లు అర్జున్ అల వైకుంఠపురం సక్సెస్ బాగా ఎంజాయి చేశాడు. ఎంతలా అంటే దాదాపు రెండేళ్ల దాకా. ఎందుకంటే ఈ మధ్యన  రెండు విడతలుగా కరోనా వచ్చి కకావికలం చేసింది. దేశమంతా కూడా ఈ మహమ్మారి తన తడాఖా చూపించింది. దాంతో కొన్నాళ్ళు రెస్ట్ తప్పలేదు. అయితే లెక్కల మాస్టార్  సుకుమార్ తో బన్నీ పుష్పరాజ్ మూవీని స్టార్ట్ చేసినా కరోనా వల్ల అది బాగా ఆలస్యమవుతూ వచ్చింది.మొత్తానికి రిలీజ్ కి మంచి డేట్ చూసుకుని మరీ లాక్ చేసేశారు. డిసెంబర్ 17న పుష్ప మూవీ వస్తోంది. అక్కడ నుంచి వారం రోజులలో  క్రిస్మస్ పండుగ ఉంది. వీకెండ్స్ ఉన్నాయి. దాంతో బొమ్మకు  హిట్ టాక్ రావాలే కానీ కలెక్షన్లు కుమ్మి పారేయాల్సిందే. పుష్ప మీద మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని యూనిట్ మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది.

సరే పుష్ప రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలయింది. ఎటూ రిలీజ్ అవుతుంది. ఆ తరువాత సంగతేటి అన్నదే చర్చ. పుష్ప తరువాత మూవీని బన్నీ ఈ రోజు వరకూ అనౌన్స్ చేయలేదు. ఎన్నో రకాలుగా ప్రచారం అయితే అవుతోంది కానీ దేని మీద క్లారిటీ లేదు. అఖండ మూవీ తరువాత బోయపాటి శ్రీనివాస్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ఆయనతో బన్నీ కాంబో రిపీట్ అంటున్నారు. మరో సరైనోడు మూవీకి ఈ ఇద్దరూ రెడీ అన్న టాక్ కూడా ఉంది. అయితే దాని మీద కూడా ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక బన్నీ పుష్ప తరువాత పాన్ ఇండియా లెవెల్ మూవీ చేయాలని చూస్తున్నారు. దాని మీద కూడా ఇంకా ఆలోచనలే సాగుతున్నాయట.

మరో వైపు చూస్తే సీనియర్ హెరోల నుంచి టాప్ హీరోల దాకా అంతా ఒకటికి నాలుగు మూవీస్ ని లైన్ లో పెట్టేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విషయమే తీసుకుంటే ఆచార్య రిలీజ్ తో సంబంధం లేకుండా భోళా శంకర్ వాల్తేరు శ్రీను గాడ్ ఫాదర్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. మరిన్ని కొత్త సినిమాలకు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు.

బాలయ్య అయితే అఖండ తరువాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మూవీకి రెడీ అయిపోయారు. ఆ తరువాత అనిల్ రావిపూడి మూవీ ఉంది. ఇంకా లైన్ లో పూరీ జగన్నాధ్ వంటి వారున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్నా చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. జూనియర్ ఎన్టీయార్ కూడా ప్రశాంత్ నీల్ తో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లతో కొత్త సినిమాలు కమిట్ అయ్యారు.

రామ్ చరణ్ అయితే శంకర్ డైరెక్షన్ లో మూవీతో పాటు గౌతం తిన్ననూరితో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారని టాక్. మాస్ మహారాజా రవితేజా అయితే అరడజన్ ప్రాజెక్టులను దగ్గర పెట్టుకున్నరు. మరి ఇంతమంది హీరోలు వరస బెట్టి ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూంటే బన్నీ నుంచి కొత్త సినిమాల ప్రకటన రాకపోవడం పట్ల ఫ్యాన్స్ అయితే అన్ హ్యాపీగా ఉన్నారుట.

అయితే పుష్ప సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేసి వచ్చే ఏడాదిలోనే బన్నీ తాను చేయబోయే మూవీస్ లిస్ట్ ని ప్రకటించే చాన్స్ ఉంది అంటున్నారు. మొత్తానికి బన్నీ ఇపుడు మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ టైమ్ లో వరసబెట్టి  పాన్ ఇండియా మూవీస్ నే చేయాలన్నది ఫ్యాన్స్ డిమాండ్.