చిరు-కొరటాల.. కౌంట్ డౌన్ 45 రోజులే

Tue Sep 17 2019 18:23:17 GMT+0530 (IST)

Countdown Starts from Chiranjeevi And Koratala Siva Film

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. అటుపై మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ 152వ సినిమాపై పూర్తి స్తాయిలో దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది కాలంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చిరు 152వ సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. స్క్రిప్టు రెడీ చేసి ప్రీప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేస్తున్నారు. అయితే సైరా లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సేఫ్ గా రిలీజ్ చేసిన తర్వాతనే చిరు తదుపరి చిత్రంపై దృష్టి సారించదలిచారు.తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి- కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ సినిమా నవంబర్ 3న ప్రారంభోత్సవం జరుపుకోనుందని తెలుస్తోంది.  అదే నెల 10 నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళతారు. అంటే కేవలం ఇంకో 45 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈలోగానే కథానాయికల ఎంపిక సహా ఇతరత్రా ఇంపార్టెంట్ కాస్టింగ్ సెలక్షన్ ని కొరటాల పూర్తి చేయనున్నారు.

`సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న లేడీ బాస్ విజయశాంతి మెగాస్టార్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారని ఇటీవల ప్రచారమైంది. అయితే దానిని కొరటాల నిజం చేస్తున్నారట. చిరంజీవి- విజయశాంతి కాంబినేషన్ కి ఉన్న క్రేజును దృష్టిలో పెట్టుకుని తనకోసం ఓ ఆసక్తికర పాత్రను డిజైన్ చేశారట ఆయన. చిరు-విజయశాంతి జోడీ అనగానే 80-90లలో క్లాసిక్ సినిమాలెన్నో గుర్తుకొస్తాయి. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు-ఛాలెంజ్- కొండవీటి రాజా- కొండవీటి దొంగ- యముడికి మొగుడు - మహానగరంలో మాయగాడు- మంచిదొంగ-పసివాడి ప్రాణం- స్వయంకృషి- గ్యాంగ్ లీడర్ ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాల్లో సమ ఉజ్జీలుగా నటించి సక్సెస్ ఫుల్ పెయిర్ గా పాపులరయ్యారు. అందుకే ఈ జోడీ రిపీటవుతుంది అంటే అది అభిమానుల్లోనూ క్రేజు నెలకొంటుంది. అయితే ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లి తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి ఆ మేరకు కొరటాల చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.