కోటరీలే హీరోల కెరీర్ ని కూల్చేస్తున్నాయా?

Sat Sep 24 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Coteries are ruining the career of heroes

ఇక సినిమా సెట్స్ పైకి రావాలంటే ముందు కథ వుండాలి. ఆ కథ హీరోల వద్దకు వెళ్లాలి..అది అతనికి నచ్చాలి.. దాన్ని ఓకే చేసి డబ్బులు పెట్టే నిర్మాతల గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ స్టోరీకి హీరో పచక్చ జెండా ఊపేస్తే ఫైనల్ అయినట్టే.. తను ఏది ఫైనల్ అంటే నిర్మాత దానికే ఓటేయడం తెలిసిందే. అయితే హీరో వద్దకు కథ వెళ్లాలంటేనే ఇప్పడు గగనంగా మారుతోంది. ఇందు కోసం దర్శకుడు చిన్న పాటి యుద్ధమే చేయాల్సి వస్తోంది.ఇంతకు ముందు కలిసి చేసి వాళ్లకు.. ఇండస్ట్రీలో పేరున్న వాళ్లకైతే డైరెక్ట్ గా లేదా ప్రొడ్యూసర్స్ ద్వారా యాక్సెస్ లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ మారుతున్న నేపథ్యంలో కొత్త కథలకు పట్టకట్టక తప్పని పరిస్థితి.. కొత్త కథ చెబితేనే స్టార్ వున్నా లేకపోయినా బాగుందన్న టాక్ వినిపిస్తే సగటు ప్రేక్షకుడు థియేటర్లకు వస్తున్న పరిస్థితి మొదలైంది. దీంతో గతంతో పోలిస్తే కొత్త కథలకు కొత్త కథలు చెప్పే కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ మొదలైంది.

అంతా బాగానే వుంది.. ఏ హీరో మైక్ పట్టుకున్నా కొత్త కథలు రావాలి.. కొత్త వాళ్లు రావాలి అనే వాళ్లే కానీ కొత్త వారికి అవకాశాలు ఇచ్చేవారు మాత్రం చాలా తక్కవ మంది స్టార్లు కనిపిస్తున్నారు. కారణం వారి చుట్టూ వున్న కోటరీలే.. గతంలో ఇద్దరు యంగ్ హీరోల పక్కన ఓ నటుడు మేనేజర్ గా అన్నీతానే అని మెయింటైన్ చేసేవాడు..సదరు హీరోలకు ఏ కొత్త దర్శకుడు కథ చెప్పాలని ప్రయత్నించినా వారి వద్దకు వెళ్లనిచ్చేవాడు కాదు.

దాంతో సదరు నటుడు మేనేజర్ గా వ్యవహరించిన ఓ హీరో కెరీర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు పరిమితం అయిపోయింది. ఇక స్టార్ హీరోల వద్ద కూడా ఇలాంటి వాళ్లే అధికంగా వున్నారట. కొత్త కథలు చెప్పాలన్నా.. వారి వద్దకు వెళ్లాలన్నా చుట్టూ వున్న కోటరీలని దాటి వెళ్లక తప్పని పరిస్థితి.. వాళ్లూ వెళ్లనివ్వరు.. దీంతో చాలా వరకు కొత్త దర్శకులు ఇన్నేవేటీవ్ కథలు పట్టుకుని ఎవరు సరైన పర్సన్ తగులుతారా అని ఇండస్ట్రీలో వెతుక్కుంటూ కాలం గడిపేస్తున్నారు.

అదీష్టం బాగుంది కాబట్టి `దసరా` దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మేకప్ మెన్ దృష్టికి వెళ్లడం అతన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి వద్దకు తీసుకెళ్లి కథ చెప్పించడం.. కథ నచ్చిన సుధాకర్ చెరుకూరి.. శ్రీకాంత్ ఓదెలని డెమో రీల్ చేసుకురమ్మని చెప్పడం.. అది టెర్రిఫిక్ గా రావడంతో తొలి ప్రయత్నంలోనే అతనికి నాని హీరోగా `దసరా` రూపంలో పాన్ ఇండియా మూవీ తగిలింది. ఇతని తరహాలోనే చాలా మంది కొత్త దర్శకుడు కొత్త తరహా కథలతో స్టార్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. కోటరీలు కూలితే కానీ టాలీవుడ్ లో మరింతగా న్యూ కాన్సెప్ట్ సినిమాలు రావనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హీరోలు మేకర్స్ ఈ విషయంలో మారాలని చాలా మంది కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.