Begin typing your search above and press return to search.

సమంత చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు

By:  Tupaki Desk   |   30 May 2023 10:00 PM GMT
సమంత చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు
X
సామాన్యులు రూ.50... రూ.100 ల చెప్పులు వేసుకుంటారు. కాస్త డబ్బు ఎక్కువ ఉన్న వారు రూ.500 నుంచి రూ.1000 ల ఖరీదైన చెప్పులు వేసుకుంటారు. ధనవంతులు అయిదు పది వేల రూపాయల చెప్పులు వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ లక్షల రూపాయలు ఖర్చు చేసి చెప్పులు వేసుకోవాల్సిన అవసరం లేదు అనేది చాలా మంది వాదన.

అయితే సెలబ్రిటీలు మాత్రం ఎక్కువ శాతం ప్రతి విషయంలో కూడా బ్రాండ్ ను మెయింటెన్ చేస్తూ ఉంటారు. అలా బ్రాండ్‌ ను మెయింటెన్ చేయాలి అంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అలా లక్షలు ఖర్చు చేసి చెప్పులు కొనే వారు చాలా మందే ఉంటారు. స్టార్స్ మరియు సెలబ్రిటీల యొక్క చెప్పుల రేట్ల గురించి మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వింటూనే ఉంటాం.

తాజాగా సమంత ఖుషి సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లింది. ఆసమయంలో ఎయిర్‌ పోర్ట్‌ లో సమంత కనిపించింది. అప్పుడు తీసిన ఫోటోల్లో సమంత ధరించిన చెప్పుల ఖరీదు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సమంత ధరించిన ఆ చెప్పుల ఖరీదు దాదాపుగా రెండు లక్షల రూపాయలకు పైమాటే అంటూ ఇంటర్నెట్ లో సెర్చ్‌ చేసిన వారు అంటున్నారు.

సమంత ధరించిన చెప్పులు లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినవి. ఇటీవల సిటాడెల్‌ కోసం లండన్‌ వెళ్లిన నేపథ్యంలో అక్కడ సామ్ ఈ చెప్పులు తీసుకుందని తెలుస్తోంది. మొత్తానికి సమంత ఇంత ఖరీదైన చెప్పులు ధరించడం ను కొందరు సమర్థిస్తూ ఉంటే కొందరు మాత్రం అవసరమా అన్నట్లు ప్రశ్నిస్తున్నారు.