హాలీవుడ్ స్టార్ డైలాగ్ కాపీ కొట్టి దొరికిపోయిన నటి

Sat Dec 05 2020 11:23:57 GMT+0530 (IST)

Copy of Hollywood star dialogue

హాలీవుడ్ నుంచి థీమ్ కాపీ కొట్టడం లేదా కొన్ని సీన్స్ లేదా పోస్టర్లు యథాతథంగా ఎత్తేయడం వగైరా వగైరా కాపీ క్యాట్ క్వాలిటీస్ గురించి అనంతంగా చర్చ సాగుతుంటుంది. ఇప్పుడు సదరు యంగ్ హీరోయిన్ ఏకంగా పాపులర్ అమెరికన్ టీవీ నటి కం జర్నలిస్ట్ కోలీ కర్ధాషియన్ డైలాగుల్నే కాపీ కొట్టేసింది. ఆ కాపీ సంగతిని కనిపెట్టేసిన ఓ నెటిజన్ పంచ్ లతో విరుచుకుపడ్డాడు. ఆ ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..పాపులర్ టీవీ షో `ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్` కోసం కోలీ కర్దాషియాన్ రెగ్యులర్ గా వినిపించే ఓ డైలాగ్ లైన్ ని అనన్య ఎత్తివేసింది. ‘కోలీ తన పోరాటాలను అనన్య నుండి కాపీ చేసారనేది నమ్మలేకపోతున్నాను’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ సూటిగా అనన్యపైనే పంచ్ వేయడం చర్చకు వచ్చింది.

ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ద్వారా కనెక్టయిన ట్విట్టర్ యూజర్లు.. అనన్య పాండే కాపీ క్యాట్ వ్యవహారాన్ని ఇట్టే క్యాచ్ చేసారు. కోలీ కర్దాషియాన్ మాట్లాడే డైలాగ్  ని ఎత్తివేసినట్లు కనుగొన్నారు.
 
బాలీవుడ్ వైవ్స్ కార్యక్రమం గత నెల చివరలో నెట్ ఫ్లిక్స్ లో ప్రారంభమైంది. అయితే నెటిజనులు ఈ కార్యక్రమం వీక్షిస్తూ చాలా కొత్త విషయాలను కనుగొంటున్నారు. ముఖ్యంగా కాపీ క్యాట్ వ్యవహారాలపై ఆసక్తికర విషయాల్ని క్యాచ్ చేస్తున్నారు. ` కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్` రియాలిటీ షోలో కోలీ కర్దాషియాన్ మాట్లాడిన పంక్తిని అనన్య పాండే ఎలా ఎత్తారో సిరీస్ ప్రేక్షకులు గ్రహించి సెటైర్లు వేయడం ప్రారంభించారు.

షో మొదటి ఎపిసోడ్లో  అనన్య తన మేకప్ షూట్ పూర్తి చేస్తున్న క్రమంలో  తన బృందంతో మాట్లాడుతూ... తన తల్లి భావన పాండే చిన్నతనంలో ఓ ప్రమాణం చేసేవారని తెలిపింది. “నేను మీ చుట్టూ పెరిగాను..  నేను చిన్నతనంలో నా పేరు F * ck * అని అనుకున్నాను. ఎందుకంటే మీరందరూ ఇదే చెప్పేవారు” అని తన తల్లి భావన అనేవారు! అంటూ అనన్య డైలాగ్ చెప్పడం .. దానికి నెటిజనుల నుంచి అంతే వేగంగా  కౌంటర్ పడిపోవడం ఇంట్రెస్టింగ్.

కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్ ఎపిసోడ్లో కోలీ కర్ధాషియన్ తన తల్లి క్రిస్ జెన్నర్ గురించి అదే డైలాగ్ చెప్పారు. ``చిన్నప్పుడు నా తల్లి చాలా శపించింది.. నా పేరు F * ck అని అనుకున్నాను`` అని అంటుంది.

ట్విట్టర్ యూజర్లు వెంటనే సారూప్యతలను కని పెట్టి అనన్యపై ట్రోలింగ్ మొదలెట్టేశారు. సరదా వ్యాఖ్యల్లోనే పంచ్ లు వినిపించారు నెటిజనం.``కోలీ కర్దాషియాన్ తన జీవిత పోరాటాన్ని అనన్య పాండే నుండి కాపీ చేసారనేది నమ్మలేకపోతున్నాం`` అని ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.

బాలీవుడ్ కి చెందిన నలుగురు స్టార్ వైఫ్స్ పై సిరీస్ అది. ఒక సన్నివేశంలో అనన్య తన తండ్రి చంకీ పాండే ఉత్తమ తొలి చిత్రానికి ఫిలింఫేర్ అవార్డును గెలుచుకోవడం గురించి.. అవార్డు ప్రదర్శనలకు వచ్చినప్పుడు అతను ఎలా ఎగ్జయిట్ అయ్యాడో కూడా మాట్లాడారు.