Begin typing your search above and press return to search.

అనుకున్నదే అయ్యింది.. ఆచార్య రిలీజ్ గందరగోళం

By:  Tupaki Desk   |   13 Sep 2021 9:36 AM GMT
అనుకున్నదే అయ్యింది.. ఆచార్య రిలీజ్ గందరగోళం
X
కరోనా కారణంగా సినిమాల విడుదల షెడ్యూల్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి. గత ఏడాది నుండి వెయిట్‌ చేస్తున్న సినిమాలు ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నాయి. కొన్ని మాత్రం చకచక రిలీజ్ అవుతున్నాయి. కరోనా భయం.. థియేటర్ల వద్ద ఆక్యుపెన్సీ భయం.. టికెట్ల రేట్లు తక్కువ ఉన్నాయి అనే భయం కారణంగా పెద్ద సినిమాల విడుదల విషయంలో వెనకడుగు వేస్తూ వస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్లని భయపడతామని దసరా నుండి పెద్ద సినిమాలు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాలు కూడా మంచి సినిమా అయితే.. పెద్ద హీరో సినిమా అయితే థియేటర్ల వద్దకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సీటీమార్ సినిమాతో నిరూపితం అయ్యింది. అందుకే దసరాకు విడుదల కాబోతున్న సినిమాలు ఖచ్చితంగా మంచి వసూళ్లను నమోదు చేస్తానే నమ్మకం వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఆచార్య రిలీజ్ గురించిన చర్చ జరుగుతోంది.

దసరా బరి నుండి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తప్పకుంటున్నట్లుగా ముందే తెలిసినా కూడా ఆచార్య ను బరిలోకి దించక పోవడం తప్పిదం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దసరాకు థర్డ్ వేవ్‌ అనే వార్తలు వచ్చాయి. కాని అదేమీ ఇప్పుడు కనిపించడం లేదు. ఖచ్చితంగా దసరాకు విడుదల కాబోతున్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్‌ చేసేలా వసూళ్లను దక్కించుకునేలా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని సీటీమార్ ఫలితాన్ని బట్టి అర్థం అవుతుంది. అందుకే ఆచార్య సినిమా దసరాకు విడుదల అయ్యి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే దీపావళికి అయినా సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు కదా పర్వాలేదు అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీపావళికి చిరంజీవి సినిమా విడుదల సాధ్యం కావడం లేదట. ఆ సమయంలోనే రజినీకాంత్‌ సినిమా ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల ఆచార్య ను నవంబర్ లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆచార్య రిలీజ్ డేట్ విషయంలో కొత్త పుకారు షికారు చేస్తోంది. సంక్రాంతికి కాకుండా ఈ ఏడాది క్రాక్‌ సినిమా వచ్చినట్లుగా పండుగకు వారం రోజుల ముందు ఆచార్య వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సంక్రాంతికి సర్కారు వారి పాట.. భీమ్లా నాయక్‌.. రాధేశ్యామ్‌ వంటి భారీ సినిమాలు ఉన్నాయి. అలాంటి సమయంలో వారం రోజుల ముందు ఆచార్యను విడుదల చేస్తాము అనడం ఖచ్చితంగా అవివేకం అవుతుంది. చిరంజీవి సినిమా అంటే కనీసం రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద హడావుడి ఉంటుంది. కనుక రెండు వారాల వరకు సోలోగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే భారీగా వసూళ్లు పండే అవకాశం ఉంటుంది. దసరాకు కనుక సినిమా విడుదల కాకుంటే విడుదల విషయంలో గందరగోళం మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అంతా అనుకున్నట్లుగానే ఆచార్య సినిమా విడుదల అటు ఇటు ఎటు కాకుండా అయ్యింది.

ఈ సినిమా కోసం వచ్చే సమ్మర్ వరకు ఆగాల్సి రావచ్చు అని కూడా కొందరు అంటున్నారు. ఏప్రిల్‌ లేదా మే లో ఆచార్య ను విడుదల చేస్తారేమో చూడాలి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో చిరంజీవితో పాటు రామ్‌ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు. కనుక సినిమాకు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను నమోదు చేసే మ్యాటర్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సినిమా విడుదల విషయంలో ఇంతటి గందరగోళం ఉండటం మంచి పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.