ఆలియా ఫ్నెగ్నెన్సీపై కండోమ్ కంపెనీ హడావుడి!

Mon Jun 27 2022 20:28:16 GMT+0530 (IST)

Condom Company Wishes For Alia Ranbir

అలియా భట్ - రణబీర్ కపూర్ బాలీవుడ్ లో అత్యంత పాపులారిటీ ఉన్న జంటగా సుపరిచితం. ప్రస్తుతం లవ్ బర్డ్స్ పేర్లు రకరకాల కారణాలతో హెడ్ లైన్స్ లోకి వస్తున్నాయి. తాజాగా తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నామని ఆలియా  ప్రకటించారు. ఈ విషయాన్ని ఆలియా తన సోషల్ మీడియా లో ప్రకటించింది. 29 ఏళ్ల ఆలియా తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి వారి సోనోగ్రఫీ సెషన్ నుండి ఒక ఫోటోని షేర్ చేసింది. ``మా పాప.. త్వరలో వస్తుంది`` అని ఆలియా వ్యాఖ్యను జోడించింది.ఈ ఫోటోగ్రాఫ్ లో ఆలియా మానిటర్ ని ఆనందంగా చూస్తోంది. ఆలియా... సింహం కుటుంబానికి చెందిన మరొక ఫోటోను పంచుకుంది. అక్కడ సింహం సింహాన్ని తట్టి లేపుతుండగా అందులో సింహం పిల్ల వాటిని చూస్తోంది. ఇది ఎంతో ఫన్నీగానూ కనిపించింది.

ఏప్రిల్ 14న ముంబైలోని ఆర్కే హౌస్ లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే ఫ్రెగ్నెన్సీ ప్రకటన వెలువడింది. గర్భధారణ వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులంతా ఈ జంటను అభినందించారు. ఒక కండోమ్ కంపెనీ నుండి ఆసక్తికరమైన అభినందన సందేశం అందింది. సదరు కండోమ్ కంపెనీ ఇన్ స్టాగ్రామ్ లో ``మెహ్ ఫిల్ మే తేరీ…హమ్ తోహ్ క్లియర్లీ నహీ ది`` అని పోస్ట్ చేసింది. పోస్టర్ పై ``అభినందనలు #రణబీర్- అలియా`` అని రాసి ఉంది. కండోమ్ కంపెనీ తెలివైన టైమింగ్ తో ఇలా ప్రచారానికి దిగింది. ఆ తెలివైన మార్కెటింగ్ ఐడియా అందరినీ ఆకట్టుకుంది. ప్రఖ్యాత అమూల్ అటువంటి తెలివైన ప్రకటనలతో పాపులరైనా ఇప్పుడు ఈ కండోమ్ కంపెనీ దీనిని అనుసరిస్తోంది.

2019లో అలియా తన బెస్ట్ ఫ్రెండ్ కం నటి ఆకాంక్ష రంజన్ తో తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో ఆలియా భవిష్యత్తులో పిల్లలను కనడంపై హింట్ ఇచ్చింది. ప్రశ్నోత్తరాల్లో ఆ ఇద్దరికీ ఒక  ప్రశ్న ఎదురైంది. మీకు ఎందరు పిల్లలు కావాలి? అని అడగ్గా `ఇద్దరు అబ్బాయిలు` అని ఆకాంక్ష తెలిపారు. `రెండు` అంటూ ఆలియా నంబర్ వేసారు.

అలియా - రణబీర్ ఈ సంవత్సరం ఏప్రిల్ 14 న వివాహం చేసుకోవడానికి ముందు ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. 2017లో వారి ఫాంటసీ-డ్రామా చిత్రం బ్రహ్మాస్త్ర సెట్స్ కి వెళ్లింది. సెట్స్ లోనే వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. రణబీర్ - ఆలియా జంటకు మొట్ట మొదటి అవకాశం ఇది. ఈ చిత్రం ఐదు భారతీయ భాషలలో విడుదలవుతోంది. హిందీ- తమిళం- తెలుగు- మలయాళం - కన్నడ భాషలలో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- నాగార్జున - మౌని రాయ్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.