Begin typing your search above and press return to search.

నీకు కోహ్లీకి పోలిక ఏంటీ అమ్మడు?

By:  Tupaki Desk   |   25 Jan 2020 2:43 PM GMT
నీకు కోహ్లీకి పోలిక ఏంటీ అమ్మడు?
X
బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశం లేదంటే ఏదైనా ఒక సెన్షేషనల్‌ కామెంట్‌ తో మీడియాలో ఉంటూనే ఉంది. ప్రస్తుతం ఆమె కొత్త సినిమా పంగా ప్రచారంలో బిజీగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం మీడియాతో పదే పదే ఇంట్రాక్ట్‌ అవుతు ఉంది. ఆ సమయంలో ఏదో ఒక విషయంపై స్పందిస్తూ మీడియాలో నిలుస్తోంది. తాజాగా ఈమె కోహ్లీ ప్రస్థావన తీసుకు వచ్చి మీడియాలో నిలిచింది.

కోహ్లీకి నాకు చాలా మంది పోలిక పెడుతూ ఉంటారు. ఆ విషయం నిజమే అనిపిస్తుంది. కోహ్లీకి నాకు రెండు విషయాల్లో పోలిక ఉన్నట్లుగా నాకు కూడా అనిపిస్తుంది. మొదటిది కోహ్లీ ఎక్కువగా వివాదాలను ఎదుర్కొన్నాడు. నేను కూడా నా కెరీర్‌ లో వివాదాలు ఎదుర్కొన్నాను. ఇక రెండవది కోహ్లీకి చాలా దూకుడు ఎక్కువ అంటారు. అలాగే నేను కూడా ప్రతి విషయంలో కూడా దూకుడుగా ఉంటాను. అందుకే ఈ రెండు విషయాల్లో మాకు సారుప్యత ఉందని కంగనా చెప్పుకొచ్చింది.

కంగనా.. కోహ్లీతో తనను తాను పోల్చుకోవడంపై నెటిజన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. కోహ్లీ క్రీడా జీవితంలో వివాదాలు అనేవి చాలా తక్కువ. అయినా ఆమె వివాదాలకు కోహ్లీ వివాదాలకు ఎక్కడైనా పోలిక ఉందా అంటున్నారు. కంగనా పబ్లిసిటీ కోసం వివాదాస్పద కామెంట్స్‌ చేసేది. ఇక కంగనా దూకుడుతో కోహ్లీ దూకుడు పోలిక ఏంటీ అంటున్నారు. కోహ్లీ దూకుడుగా ఉండటం వల్ల ఎన్నో అద్బుత విజయాలను ఇండియాకు అందిచాడు. మరి కంగనా దూకుడు ఏం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు?