తమిళ స్టార్స్ తో పోల్చితే మన స్టార్స్ ఈ విషయంలో బెటర్

Sun Jul 03 2022 20:00:01 GMT+0530 (IST)

Compared to Tamil stars our stars are better in this regard

సినిమా ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరికి ఈగోలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. హీరోయిన్స్ లో పోటీ తత్వం.. హీరోల మధ్య పోటీ తత్వం ఉండటం మంచిదే కాని ఈగో ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఒకప్పుడు మన తెలుగు హీరోలు ఈగోలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉండేవారు అనే టాక్ వచ్చేది. కాని ఇప్పుడు మన హీరోల్లో చాలా మార్పు వచ్చింది. కాని తమిళ స్టార్స్ మాత్రం ఇంకా అదే ఈగో తో ఉన్నారా అనే అనుమానం ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసుకున్న తర్వాత కలుగక మానదు.విషయం ఏంటీ అంటే తమిళ సూపర్ స్టార్.. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమా లో నటించాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విక్రమ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగు స్టార్ హీరోలు పలువురు విక్రమ్ సినిమా పై ప్రశంసల జల్లు కురిపించారు.

చిరంజీవి స్వయంగా తన ఇంటికి విక్రమ్ సినిమా యూనిట్ ను ఆహ్వానించి సన్మానించిన విషయం తెల్సిందే. మహేష్ బాబుతో పాటు పలువురు స్టార్స్ సోషల్ మీడియా ద్వారా విక్రమ్ సినిమా సక్సెస్ నేపథ్యంలో కమల్ కు అభినందనలు తెలియజేశారు. విక్రమ్ సినిమా గురించి మాత్రమే కాకుండా తెలుగు స్టార్స్ ఈమద్య కాలంలో ఇతర సినిమాలపై కామెంట్స్ చేయడం కామన్ విషయం గా చూస్తున్నాం.

కమల్ విక్రమ్ సినిమాకు తమిళ స్టార్స్ నుండి వచ్చిన అప్రిషియేషన్ ఏమీ లేదు. ఎంత మంది తమిళ స్టార్స్ విక్రమ్ సినిమాను గురించి కామెంట్స్ చేశారు అంటే జీరో అనే సమాధానం వస్తుంది. పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు ఎవరు కూడా కమల్ విక్రమ్ సినిమా గురించి స్పందించడం లేదు. ఈ విషయంలో తమిళ స్టార్స్ తో పోల్చితే మన తెలుగు స్టార్స్ అత్యుత్తములు అంటూ తెలుగు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విక్రమ్ సినిమా ఆల్ టైమ్ రికార్డు ను నమోదు చేయడం తో అంతకు ముందు ఉన్న పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. దాంతో కొందరు అసూయతో ఉంటే మరి కొందరు మాత్రం తమకు ఆ సక్సెస్ దక్కలేదు అనే అసూయతో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విక్రమ్ గురించి కమల్ నటన గురించి లోకేష్ కనగరాజ్ నటన గురించి కోలీవుడ్ హీరోలు కూడా స్పందించాల్సిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.