Begin typing your search above and press return to search.

సునీల్ చేతిలో 10 వేల సినిమాలు

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 AM GMT
సునీల్ చేతిలో 10 వేల సినిమాలు
X
కమెడియన్ గా కెరీర్ మొదట్లో మంచి గుర్తింపును అందుకున్న సునీల్ ఆ తరువాత హీరోగా మారి కొన్నేళ్ల వరకు మంచి పారితోషికం అందుకున్నాడు. అయితే ఆదాయం విషయంలో సునీల్ ఒక మెట్టు ఎదిగినప్పటికీ కూడా క్రేజ్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను సంతృప్తి పరచలేక పోయాడు.

కమెడియన్ గా అతనికి వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువ కానీ హీరోగా మాత్రం ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. ఇక మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ప్రేక్షకులు అతన్ని మళ్లీ పాత సునీల్ గా చూడడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మొన్నటి వరకు చేసిన కొన్ని కామెడీ రోల్స్ అయితే పెద్దగా క్లిక్ అవ్వలేదు. కానీ ఇటీవల వచ్చిన F3 పాత్ర మాత్రం పర్వాలేదనిపించింది. మళ్లీ పాత సునీల్ ని చూసినట్లుగా ఉంది అని ఓ వర్గం ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సునీల్ చేతిలో దాదాపు పదివేల సినిమాలు ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయితే అవి చేయాల్సిన సినిమాలు కాదు చూడాల్సిన సినిమాలని వివరణ ఇచ్చాడు.

సునీల్ ఏ దేశం వెళ్ళిన కూడా అక్కడి నుంచి ఏదో సీడీ ని కొనుక్కోవడం ఒక అలవాటుగా వస్తోందట. అతనికి కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అని తెలియజేశాడు. 'ఎక్కడికి వెళ్లినా కూడా ఏదో ఒక కొత్త తరహా సిడిలను కొనడం నాకు ఇష్టం.

ఆ లెక్కన చూస్తే ఇప్పటివరకు నేను దాదాపు పదివేల సిడిలు కొన్నాను. అయితే ఇంకా అవి పూర్తిగా చూడలేదు. ఇప్పటికీ రెండు వేలు మాత్రమే చూడగలిగాను. మిగిలిన వాటిని చూడాలి అంటే జీవితకాలం మొత్తం కూడా సరిపోదు. లాక్ డౌన్ లో కొన్ని చూసేసాను.

ఇక నటన విషయంలో అయితే మన పెద్ద వాళ్ల నుంచి చాలా నేర్చుకోవాలి. మన కంటే ముందే వాళ్ళు చాలా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఉతికి ఆరేశారు అని చెప్పాలి. వాళ్ళు ఉతికి ఆరేసిన క్లాత్ ని మళ్ళీ మనం వాడుకుంటూ ఉన్నాము' అని సునీల్ సరదాగా వివరణ ఇచ్చాడు.