కమెడియన్ ఫృథ్వీ కారుకు ప్రమాదం

Tue Oct 20 2020 19:30:02 GMT+0530 (IST)

Accident to comedian Prithvi's car

హాస్యనటుడు.. వైసీపీ నాయకుడు ఫృథ్వీ కారుకు ప్రమాదం జరిగింది. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి సమీపంలో బంజారా హిల్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. వేగంగా వస్తున్న టయోటా ఇన్నోవా కారు వెనుక నుండి ఫృథ్వీ ఫార్చ్యూనర్ కారును ఢీకొట్టింది. ఫృథ్వీకి ఎటువంటి గాయాలు కాలేదు. అతని కారు కొద్దిగా దెబ్బతింది. కాగా ఢీకొట్టిన ఇన్నోవా కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది.కొందరు ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వెలుగుచూసింది. దెబ్బతిన్న కార్ల చిత్రాలు వైరల్ అయ్యాయి. . దీనిపై ఫృథ్వీ స్పందించారు. “నా కారు బంజారా హిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ప్రమాదానికి గురైంది.. ఒక కారు వేగంగా వచ్చి నా కారును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నా కారు దెబ్బతింది. సంఘటన జరిగిన ప్రదేశంలో ప్రజలు గుమిగూడి వెలికితీశారు” అని నటుడి పోస్ట్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

ఫృథ్వీకి గత ఆగస్టులోనే కరోనా లక్షణాలు బయటపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మొదట క్వారంటైన్ లో ఉండి తరువాత ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు రాజకీయంలో యాక్టివ్ అవుతున్నారు.