కలర్స్ స్వాతి మరో వినూత్న ప్రయోగం

Wed Jul 06 2022 12:00:01 GMT+0530 (IST)

Colour Swati Month Of Madhu First Look

'అందాల రాక్షసి' మూవీ నుంచి విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రామిసింగ్ హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో నవీన్ చంద్ర. ఇటీవల రానా సాయి పల్లవి నటించిన 'విరాటపర్వం'లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్న నవీన్ చంద్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మధు'.ఇదే మూవీతో 'కలర్స్' స్వాతి సెకండ్ ఇన్సింగ్స్ ని స్టార్ట్ చేస్తోంది.  శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నారు. 'భానుమతి & రామకృష్ణ' చిత్రాన్ని నిర్మించిన క్రిషివ్ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ మేకర్స్ పై యశ్వంత్ ములుకుట్ల తాజా మూవీని నిర్మిస్తున్నారు.ఈ సంస్థ నిర్మించిన రొ మాంటిక్ లవ్ స్టోరీ 'భానుమతి & రామకృష్ణ' ఆహా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. మళ్లీ ఇదే సంస్థ అదే హీరో నవీన్ చంద్రతో 'మంత్ ఆఫ్ మధు' పేరుతో  మరో ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టింది.

విభిన్నమైన కథ కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని మేకర్స్ బుధవారం విడుదల చేశారు. యునిక్ ఐడియాతో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ కూడా యునిక్ గానే వుంది.

ప్రస్తుతం నెట్టింట ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. 'మంత్ ఆఫ్ మధు' టైటిల్ వినగానే సంథింగ్ ఈజ్ యునిక్ స్టోరీ ఈజ్ దేర్ అనే భావన ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతోంది. బంధాల నేపథ్యంలో సాగే మూవీ ఇది. సమాజంలోని వ్యక్తుల మధ్య ఏర్పడే రిలేషన్ షిప్ ల నేపథ్యంలో సరికొత్త పంథాలో ఈ మూవీని రూపొందించినట్టుగా తెలుస్తోంది.  

ఈ మూవీని అత్యధిక భాగం వైజాగ్ లోని సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. లైవ్ లొకేషన్స్ లో సింక్ సౌండ్ టెక్నాలజీని ఉపయోగించి చాలా వాస్తవికంగా వుండేలా రూపొందించారని తెలుస్తోంది. కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది.

శ్రేయా నావిల్ హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించారు.అచ్చు రాజమని సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ని త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత కలర్స్ స్వాతి మళ్లీ ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  విభిన్నమైన ప్రయోగంగా రూపొందిన ఈ మూవీ కలర్స్ స్వాతి కెరీర్ కి ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.