అ ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్..?

Mon Feb 24 2020 21:00:01 GMT+0530 (IST)

Cold War Between Two Heroes

వారిద్దరూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు.  ఒకరేమో వరస విజయాలతో దుమ్ములేపి స్టార్ అయ్యాడు.  ఈమధ్య ఫ్లాపులు వస్తున్నాయి. మరొకరేమో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్టుగా అనతికాలంలోనే క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ క్రేజీ హీరో దెబ్బకు ముందుగా మీడియం రేంజ్ హీరోల్లో టాప్ అనిపించుకున్న హీరో స్థానానికి ఎసరు వచ్చింది.  ఈ ఇద్దరు పైకి స్నేహితులుగా కవరింగ్ ఇస్తున్నారట కానీ లోపల మాత్రం కోల్డ్ వార్ జరుగుతోందని అంటున్నారు.నిజానికి ఇద్దరికీ సీ సెంటర్లలో మార్కెట్ లేదు. ఆ క్రేజీ హీరోకు సీ తో పాటు బీ సెంటర్లలో కూడా వీకే.  అయితే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా లేని ఈ హీరోలు బయట మాత్రం లేనిపోని హైప్ సృష్టిస్తున్నారట.  ఈ ఇద్దరి హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ అంటూ కృత్రిమంగా ఈ హడావుడి చేయిస్తున్నారట.  ఈ హీరోలు నటిస్తున్న సినిమాల నిర్మాణ సంస్థలు కొందరు ఉద్యోగులను నియమించి మరీ ఈ ఫేక్ పబ్లిసిటీ స్టంట్స్ చేయిస్తున్నారని ఫిలిం నగర్ టాక్.  ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ హీరోలిద్దరూ ఇలా చెయ్యమని ప్రోత్సహిస్తూ ఉన్నారట.  

ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఈగో క్లాషెస్ వచ్చాయని అంటున్నారు. ఆ క్రేజీ హీరో సినిమా ఈమధ్య బోల్తా కొట్టడంతో మరో హీరో.. ఆయన టీమ్ బోల్తా పండగ జరుపుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ కోల్డ్ వార్ సంగతి తెలిసిన ఇండస్ట్రీ సీనియర్లు కథలపై.. నటనపై దృష్టి పెట్టకుండా ఈ చెత్తపనులు ఎందుకని అంటున్నారు.  ఈ మీడియం రేంజ్ హీరోలకు ఆ విషయం ఎప్పుడు అర్థం అవుతుందో.. ఎప్పుడు ఈ ఫేక్ రచ్చలను వదిలిపెట్టి టాప్ రేంజికి వెళ్తారో మరి.