భర్తతో గొడవలపై క్లారిటీ.. అక్కడ జరిగింది మాత్రం చెప్పను!

Mon Jun 14 2021 15:00:01 GMT+0530 (IST)

Clarity on the quarrels with her husband .. I can not say what happened there!

తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఒక వయసు వచ్చిన తర్వాత కనుమరుగయ్యి మళ్లీ కొన్నాళ్ల తర్వాత ఆంటీగా అమ్మగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే ప్రియమణి మాత్రం అందరికంటే విభిన్నం అంటూ నిరూపించుకుంది. హీరోయిన్ గా హాట్ అందాలను ఆరబోసిన ముద్దుగుమ్మ ప్రియమణి పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. ఒక వైపు బుల్లి తెరపై షేర్ చేస్తూనే మరో వైపు వెండి తెరపై బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడం వల్ల కూడా ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఇటీవలే స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. ఆ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా ప్రియమణి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. సమయంలోనే ఒక చిట్ చాట్ లో ప్రియమణి పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చింది. భర్తతో గొడవలు అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేసింది. తన భర్త సపోర్ట్ వల్లే తాను ఇంత బిజీగా ఉన్నాను.

ఆయన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆఫర్లు పెరిగాయి. అందుకే ఆయన నాకు లక్కీ చామ్. నాకు ఆయన నుండి దక్కుతున్న మద్దతు కారణంగానే ఇన్ని ప్రాజెక్ట్ లను ఒకేసారి మేనేజ్ చేయగలుగుతున్నాను. ఇక అందరు భార్య భర్తల మద్య మాదిరిగానే మా మద్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాని ఆ సమయంలో ఆయనే కాంప్రమైజ్ అవుతాడు అంటూ తన భర్త గురించి చెబుతూ మురిసి పోయింది.

ఇక ఫ్యామిలీ మ్యాన్ చూసిన చాలా మందికి ఉండే అనుమానం అరవింద్ తో కలిసి లోనావాలోలో సుచిత్ర ఏం చేసింది.. ఇద్దరి మద్య జరిగిన సంఘటన ఏంటీ అనేది తెలుసుకోవాలని కోరిక. ఆ విషయమై స్పందిస్దూ.. అది టాప్ సీక్రెట్ నేను ఆ విషయాన్ని మాత్రం చెప్పనంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది. ఆ సంఘటన ఎప్పటికి అలా సస్పెన్స్ గా.. సీక్రెట్ గా ఉండాల్సిందేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈమె తెలుగులో విరాట పర్వం మరియు నారప్ప సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.