క్లారిటీ వచ్చేసినట్లేనా మాష్టారు!

Mon Aug 15 2022 22:00:02 GMT+0530 (IST)

Clarity has come Master!

ప్రేమించి పెళ్లి చేసుకున్న  టాలీవుడ్ దంపతులిద్దరి మధ్య దూరం పెరిగిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. కొన్ని  సంఘటనలు సైతం ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసాయి. తనయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం  ఆ దర్శకుడు హాజరు కాకపోవడం.. అదే వేదికపై ఓ నిర్మాత దర్శకుడిని ఉద్దేశించి మాట్లాడటం వంటివి మరింత సందేహాలకు తావిచ్చింది.అయితే  వాటిని నివృతి చేసుకోవడం కోసం సన్నిహితుల్ని మీడియా ప్రశ్నించడం..వాటికి అలాంటిదేమి లేదని వివరణ ఇవ్వడం జరిగింది. నిప్పులేనిదే పొగ రాదుగా అన్న నానుడిని ఆధారంగా చేసుకునే ఈ ప్రచారమంతా తెరపైకి వచ్చింది.  అయితే ఇంత వరకూ అసలు వ్యక్తులెవరు దీనిపై స్పందించింది లేదు. తాజాగా ఓ వేడుక సందర్భంగా సదరు దర్శకుడు భార్య గురించి స్పందించి వాటన్నింటికి చెక్ పెట్టారు.

భార్య కోరిక మేరకు అతను ఆ యంగ్ హీరో సినిమా చూడటం...వెంటనే ఆ హీరోతో సినిమా చేయాలని ఓ నిర్ణయానికి రావడం...అడ్వాన్స్ పంపించడం..సినిమా పూర్తి చేయడం అన్ని జరిగిపోయాయి. దూరమయ్యారు? అన్న ప్రచారం  గత రెండు..మూడు నెలలు గా పీక్స్ కి చేరింది. ఈ సమయంలో ఆ దర్శకుడి సినిమాకి సంబంధించి పలు ఈవెంట్లు సైతం జరిగాయి.

కానీ వాటిలో ఎక్కడా భార్య గురించి స్పందించింది లేదు. కానీ తాజా వేడుకలో అర్ధనారి గురించి చెప్పడంతో  మీడియాలో జరుగుతోన్నది  అంతా గాలి ప్రచారమని క్లారిటీ వస్తుంది. వాటిపై క్లారిటీ ఇవ్వడం కోసమే సదరుడు దర్శకుడు  ప్రత్యేకంగా  భార్య టాపిక్ తీసుకొచ్చారన్నది కొందరి అభిప్రాయం. అయితే ఇది సందర్భాను సారంగా చోటు చేసుకున్నది అనడానికి ఛాన్స్ ఉంది.

ఎందుకంటే? అక్కడి సిచ్వేషన్ అలాంటిది.  వేదికలపై స్పీచ్ అన్నది సీచ్వెషనల్ గానే చోటు చేసుకుంది. అదీ ఆ దర్శకుడికి ప్రీ ప్లానింగ్ అనేది అస్సలుండదు. అలాంటి ఐడియానే అతనికి తట్టదు.  అక్కడ పరిస్థితిని ..సందర్భాన్ని బట్టి మాట్లాడేస్తారు. జీవితాన్ని  ఎప్పుడూ ఒకే కోణంలో చూసే దర్శకుడాయన. ఎన్ని సమస్యలొచ్చినా పిల్లర్ లా నిలబడే వ్యక్తిత్వంగ లవాడు.

పడిలేచిన కెరటం లాంటాడు. వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలొచ్చినా వాటిని సైతం పాజిటివ్ గా తీసుకుని ముందుకు సాగిపోయే వ్యక్తిత్వం  గలవాడు. బీ పాజిటివ్..ఆల్వేస్ పాజిటివ్ అంటారు. యువతకి సైతం తనదైన శైలిలో సందేశాలు పాస్ చేస్తుంటారు. అవెంతో  స్పూర్తి దాయకంగానూ ఉంటాయి. అలాంటి దర్శకుడి వ్యక్తిగత జీవితంలో గాలి వార్తలు అభిమానుల్ని కాస్త నిరుత్సాహ పరిచాయి.