Begin typing your search above and press return to search.
సిటాడెల్ ట్రైలర్: యాక్షన్ అడ్వెంచర్ రొమాన్స్ తో అదరగొట్టిన పీసీ
By: Tupaki Desk | 30 March 2023 8:40 PMకింగ్ ఖాన్ 'పఠాన్' స్పై ఆపరేషన్ నేపథ్యంలో గగుర్పొడిచే విన్యాసాలతో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా అలరించింది. బాండ్ 007 తరహా థ్రిల్లింగ్ అడ్వెంచర్లతో కింగ్ ఖాన్ - దీపిక పదుకొనే బృందం భారీ అడ్వెంచర్స్ తో మైమరిపించారు. ఆ తర్వాత అంతకుమించిన విజువల్ ట్రీట్ కావాలనుకునే యాక్షన్ ప్రియుల కోసం ఇప్పుడు సిటాడెల్ అందుబాటులోకి వస్తోంది.
సరిగ్గా అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ కు నాలుగు వారాల దూరంలో ఆల్ టైమ్ రెండో అత్యంత ఖరీదైన టీవీ సిరీస్ సిటాడెల్ కొత్త ట్రైలర్ విడుదలైంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ అమెజాన్ ప్రైమ్ జాబితాలో ఖరీదైన సిరీస్ గా మొదటి స్థానంలో ఉంది. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్-ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ చిత్రాలను అందించిన ద్వయం జో అండ్ ఆంథోనీ రస్సో రూపొందించిన సిరీస్ ఇది.
ఇతర ప్రధాన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ హిట్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఓటీటీ సిరీస్ ని రూపొందించారు. సిటాడెల్ భారతదేశం-ఇటలీ-మెక్సికో - స్పెయిన్ లలో అనేక సిటీలతో స్పిన్-ఆఫ్ సిరీస్ లను విస్తరించే కొత్త గూఢచారి విశ్వంగా ప్రచారంలో ఉంది.
ప్రియాంక చోప్రా జోనాస్ (ది వైట్ టైగర్-ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్) .. రిచర్డ్ మాడెన్ (బాడీగార్డ్-గేమ్ ఆఫ్ థ్రోన్స్) ప్రైమరీ అమెరికన్ స్పై ఏజెంట్లుగా ట్రైలర్ లో కనిపిస్తున్నారు. ఆ ఇరువురు స్పైల అంతం నుండి ఎనిమిది సంవత్సరాల తరువాత సిటాడెల్ స్టోరీ మొదలవుతుంది. నామమాత్రపు స్వతంత్ర ప్రపంచ గూఢచారి సంస్థ 'సిటాడెల్' మాజీ ఏజెంట్లు - భాగస్వాములు మాసన్ కేన్ (మాడెన్) .. నదియా సిన్హ్ (చోప్రా జోనాస్) ..భారీ విపత్తు తర్వాత వారి జ్ఞాపకాలను తుడిచిపెట్టుకుపోతాయి. సిటాడెల్ అంతిమానికి కారణమైన మాంటికోర్(విలన్)ను అడ్డుకునే లక్ష్యంతో తిరిగి కలిసి వస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరికీ మరింత గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. కొత్త సిటాడెల్ ట్రైలర్ ఆద్యంతం అర్థమయ్యే కథాంశమిది. ఈ థ్రిల్లర్ లో గగుర్పొడిచే విన్యాసాలు కట్టి పడేస్తున్నాయి.
కొత్త ట్రైలర్ లో సిటాడెల్ త్ గా స్టైలిష్ గా కనిపించినప్పటికీ కొత్త ప్రైమ్ వీడియో సిరీస్ కోసం భారీ బడ్జెట్లను వెచ్చించాల్సొచ్చిందని తెలిసింది. ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం..వాస్తవానికి ఏడు ఎపిసోడ్ లకు $160 మిలియన్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని అంచనా. ప్రస్తుతానికి సిటాడెల్ మొదటి సీజన్ అందుబాటులోకి రానుంది.
మాసన్ కేన్ గా రిచర్డ్ మాడెన్ .. నదియా సిన్‌గా చోప్రా జోనాస్‌తో పాటు ప్రైమ్ వీడియో సిరీస్‌లో సిటాడెల్ సహోద్యోగిగా స్టాన్లీ టుక్సీ (ఇన్ సైడ్ మ్యాన్) నటించారు. హ్యాండ్లర్ బెర్నార్డ్ ఓర్లిక్ - లెస్లీ మాన్‌విల్లే (ఫాంటమ్ థ్రెడ్) బ్రిటిష్ రాయబారిగా తెరపై కనిపిస్తారు. విలన్ లలో యు.ఎస్. డహ్లియా ఆర్చర్... కార్టర్ స్పెన్స్.. యాష్లే పాత్రలో ఓసీ ఇఖిలే జెట్ ట్రాష్) కూడా తారాగణంలో భాగం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.