మోస్ట్ వెయిటెడ్ 'సర్కస్' ట్రైలర్ టాక్.. ఫుల్ ఆఫ్ ఫన్

Fri Dec 02 2022 19:29:59 GMT+0530 (India Standard Time)

Cirkus Official Trailer Ranveer Singh

రణ్‌వీర్ సింగ్ హీరోగా పూజా హెగ్డే మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా దీపిక పదుకునే స్పెషల్ సాంగ్ లో నటించిన సర్కస్ సినిమా ఈ క్రిస్మస్ కు బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది లో పూర్తిగా సౌత్ ఇండియన్ సినిమాల ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో చివరి అవకాశం అన్నట్లుగా బాలీవుడ్ నుండి సర్కస్ రాబోతుంది.కనీసం ఈ ఒక్కటి అయినా బాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క పరువు నిలుపుతుందా అనేది ఆసక్తిగా మారింది క్రిస్మస్ కు విడుదల కాబోతున్న సర్కస్ సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయ్యింది. మోస్ట్ వెయిటెడ్ ట్రైలర్ నవ్వులు పూయించింది. సినిమా ఎలా ఉండబోతుంది అనే ఒక క్లియర్ పిక్చర్ ను ప్రేక్షకుల ముందు ఉంచింది అనడంలో సందేహం లేదు.

రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో ద్వి పాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర కరెంట్ మ్యాన్ గా చూపించబోతున్నారు. ఆ పాత్ర కు కరెంట్ షాక్ తగిలినా కూడా ఏమీ కాదు అని చూపించారు. అంతే కాకుండా రణ్వీర్ సింగ్ ఏదో విషయమై చాలా గందరగోళంలో ఉన్నాడు. ఆ గందరగోళంకు కారణం ఏంటి అనేది సినిమా చూస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రోహిత్ శెట్టి సినిమా అనగానే కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఆసక్తి కనబర్చుతూ ఉంటారు. వారి ఆసక్తికి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సర్కస్ ఉంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పూజా హెగ్డే మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ల యొక్క పాత్రలు సినిమాలో ఎలా ఉంటాయో కానీ ట్రైలర్ లో మాత్రం గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉండేలా ఉంటాయేమో అనిపిస్తుంది. ఇక ట్రైలర్ చివర్లో వచ్చిన దీపికా పదుకొనే ఒక్క సారిగా సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా సాంగ్ లో కనిపించబోతుందని అనిపిస్తుంది. మొత్తానికి ఫుల్ ఆఫ్ ఫన్ తో సర్కస్ సాగబోతుందని అనిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.