Begin typing your search above and press return to search.

సెట్లో షాక్: గ‌న్ ఫైరింగ్ లో ఛాయాగ్రాహ‌కుడు మృతి!

By:  Tupaki Desk   |   23 Oct 2021 5:42 AM GMT
సెట్లో షాక్: గ‌న్ ఫైరింగ్ లో ఛాయాగ్రాహ‌కుడు మృతి!
X
ఊహించ‌ని ప‌రిణామంతో హాలీవుడ్ ప్ర‌స్తుతం షాక్ లోకి వెళ్లిపోయింది. సెట్లో తుపాకి కాల్పుల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ నేల‌కొర‌గ‌డం సంచ‌ల‌న‌మైంది. వివ‌రాల్లోకి వెళితే.. అమెరిక‌న్ న‌టుడు అలెక్ బాల్డ్విన్ న‌టిస్తున్న మూవీ ప్ర‌స్తుతం సెట్స్ పై చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఓ స‌న్ని వేశంలో హీరో అలెక్ డ‌మ్మీ గ‌న్ ని పేల్చాలి. అయితే ఇది మిస్ ఫైర్ కావ‌డంతో ఆ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న సినిమాటోగ్రాఫ‌ర్ హాలీన్ హ‌చిన్స్ బుల్లెట్ త‌గిలి మృతి చెందాడు.

ఇదే సంద‌ర్భంగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు జోయెల్ కూడా ప్ర‌మాదానికి గురై గాయ‌ప‌డ్డారు. అలెక్ బాల్డ్విన్ త‌న కొత్త చిత్రం `ర‌స్ట్‌` షూటింగ్ చేస్తున్న స‌మ‌య‌మంలో మెక్సికోలో గురువారం ఈ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అలెక్ బాల్డ్విన్ బీటిల్ జ్యూస్‌.. ది బాస్ బేబీ .. సిట్ కామ్ 30 రాక్ చిత్రాల‌తో పాపుల‌ర్ అయ్యాడు. అనూహ్యంగా చోటు చేసుకున్న తాజా సంఘ‌ట‌న ప‌ట్ల చిత్ర బృందం త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది.

`నేడు జ‌రిగిన విషాద సంఘ‌ట‌న‌తో తారాగ‌ణం.. చిత్ర సిబ్బంది అంతా హ‌తాశుల‌య్యారు. హ‌లీనా కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాం అని.. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే సినిమా షూటింగ్ ని నిలిపివేశామ‌ని.. శాంటా ఫే పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి తాము పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నామ‌ని చిత్ర ప్ర‌తినిధి స్పందించారు. ముందు ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర బృందం సినిమాటోగ్రాఫ‌ర్ ని ప్ర‌త్యేక హెలీకాప్ట‌ర్ లో అల్బుకెర్కీలోని న్యూ మెక్సికో విశ్వ‌విద్యాల‌య ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డే ఆయ‌న మ‌ర‌ణించారు. ద‌ర్శ‌కుడు జోయెల్ సౌజా.. అలెక్ బాల్డ్విన్ కార‌ణంగా గాయ‌ప‌డ‌టంతో అత‌న్ని కూడా స‌మీపంలో వున్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న చికిత్స పొందుతున్నారు. అయితే ప్ర‌మాదానికి కార‌ణ‌మైన అలెక్ బాల్డ్విన్ ని విచారించిన పోలీసులు ఆ త‌రువాత అత‌న్ని విడిచిపెట్టారు.