Begin typing your search above and press return to search.

ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్.. మనవి రెండు!

By:  Tupaki Desk   |   1 Feb 2023 8:00 AM GMT
ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్.. మనవి రెండు!
X
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. చాలాకాలం తర్వాత ఓ బాలీవుడ్ మూవీ మంచి టాక్‌తో నడుస్తోంది. ఇదిలా ఉండగా పఠాన్ మూవీ స్పై, సినిమాటిక్ యూనివర్స్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో పఠాన్ మూవీ తెరకెక్కింది. అంతకుముందు ఇదే దర్శకుడు సిద్ధార్థ్.. వార్‌, ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై లాంటి స్పై థ్రిల్లర్స్ నిర్మించింది యశ్‌రాజ్‌ ఫిల్స్మ్. వీటన్నింటిని కలిపి యశ్‌రాజ్‌ ఫిల్స్మ్ స్పై యూనివర్స్ అంటూ ఇప్పుడు చర్చ మొదలైంది.

ఇవే కాకుండా టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీల నుండి కూడా సినిమాటిక్ యూనివర్స్ రానున్న సంగతి ఇప్పటికే తెలిసిందే.మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, డీసీ సినిమాటిక్ యూనివర్స్ తర్వాత తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలతో భారత్‌ లోనూ సినిమాటిక్ యూనివర్స్ లపై చర్చ మొదలైంది. లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశాడు.లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని మూవీస్ ప్లాన్ వేశాడు.దళపతి విజయ్ తో మాస్టర్ మూవీ తీసిని లోకేష్ కనగరాజ్ వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తదుపరి చిత్రంలో కమలహాసన్ కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అలా తన మూవీలకు లింక్ ఇవ్వనున్నారు. ఇక తెలుగు నుండి శైలాష్ కొలను డైరెక్షన్ లో ఇప్పటికే హిట్-1, హిట్-2 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఫ్రాంచైజీలో మరికొన్ని సినిమాలు రానున్నాయి. హిట్-3 మూవీలో హీరో నాని అని హిట్-2 సినిమా క్లైమాక్స్ లో రివీల్ చేశారు.యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ గురించి కూడా ఇప్పటికే ప్రకటించారు.

అందులో భాగంగా తేజ సజ్జా ప్రధాన పాత్రలో హనుమాన్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచింది. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ లో అధిరా మూవీ కూడా చేయనున్నట్లు పోస్టర్ కూడా విడుదల చేశారు.

పి.వాసు దర్శకత్వంలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార కీలక పాత్రలో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి సీక్వెల్‌గా నాగవల్లి సినిమా ఇప్పటికే వచ్చేసింది. ఇప్పుడు కంగనా ప్రధాన పాత్రలో చంద్రముఖి -2 సినిమా తీయనున్నారు పి. వాసు. చంద్రముఖి-2 సినిమాలో రాఘవ లారెన్స్ కూడా నటించనున్నారు. చంద్రముఖి ఫ్రాంచైజీని డైరెక్టర్ పి.వాసు సినిమాటిక్ యూనివర్స్ గా తీర్చిదిద్దుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.