మిల్కీ బ్యూటీ చేతిని అలా పట్టుకున్న ఛోటాగారు!

Sat Jun 22 2019 12:35:57 GMT+0530 (IST)

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది అందరూ గర్హించాల్సిన విషయమే.  అయితే ఈ అసభ్యత.. వేధింపులు అనే పదాలు చాలా క్లిష్టమైనవి.   ఓ ఓరచూపు చూస్తే కూడా నేరమంటుంది చట్టం!  అయితే మన టాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరు ఈ సభ్యత అనే లైన్ అప్పుడప్పుడూ దాటుతుంటారు.  అలాంటి వారిలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు ఒకరు.అప్పట్లో ఒకసారి ఛోటా గారికి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ముద్దొచ్చింది.. పబ్లిక్ గా స్టేజ్ పైనే ఉమ్మ అంటూ ఒక ముద్దిచ్చారు.  పాపం.. జరిగింది ఏంటో అర్థం కాక.. మింగలేక కక్కలేక కాజల్ సరిపెట్టుకుంది.  అయితే కాజల్ ఊరుకున్నా కాకుల లాగా ఉండే లోకం ఊరుకోదుగా? హంగామా జరిగింది. అది గతం.. రజనీ లాగా గతం గతః అనుకుందామంటే మరో ఇన్సిడెంట్ జరిగింది.  

రీసెంట్ గా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగారి గది 3' సినిమా లాంచ్ జరిగింది.  ఈ సినిమాలో తమన్నా ప్రధానపాత్రలో నటిస్తోంది.  ఈ సినిమా లాంచ్ కార్యక్రమం జరిగే సమయంలో తమన్నా పక్కనే ఛోటా గారు నిలబడ్డారు.  తమన్నా చేతిని తనచేతిలోకి తీసుకొని ప్రేమతో గట్టిగా పట్టుకున్నారు.  కానీ చూపరులకు అది చేతిని 'నొక్కినట్టుగా' కనిపించింది.  ఎంతైనా పాడు లోకం కదా.. జనాల పాడు కళ్ళకు ఛోటా గారు చేసే మంచి పనులు కనపడవు కానీ పాడుపనులు భలేగా కనపడతాయి.  దీంతో ఛోటా గారు మళ్ళీ గీత దాటారంటూ గగ్గోలు మొదలయింది. అయినా గీత దాటారని చెప్పాల్సింది మిల్కీ బ్యూటీ కదా?

తను మాత్రం ఏం జరగనట్టుగా అత్యంత సాధారణంగా కనిపించింది. సహజంగా డైరెక్టర్లతో.. హీరోలతో.. సినిమాటోగ్రాఫర్లతో హీరోయిన్లు గొడవ పెట్టుకోలేరని అందుకే తమన్నా ఏం జరగనట్టు కామ్ గా ఉందని కొందరు అంటున్నారు. సభ్యసమాజం ఒప్పుకోని 'అసభ్య' సంఘటనపై అటు ఛోటా గారు కానీ ఇటు మిల్కీ బ్యూటీ కానీ ఇంకా స్పందించలేదు.