Begin typing your search above and press return to search.

కరోనా కాటు: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

By:  Tupaki Desk   |   28 Nov 2021 4:14 PM GMT
కరోనా కాటు: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
X
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చివరకు శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేశారు.గత కొన్ని రోజులుగా శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతుంటే పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం కూడా చేశారు. తమిళ హీరో ధనుష్ రూ.10లక్షలు, మెగాస్టార్ చిరంజీవి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేశారు. సోనూసూద్ సైతం శివశంకర్ మాస్టర్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

ఇంతమంది ఆర్థికసాయం చేసి అండదండలు అందజేసినా కూడా శివశంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోయారు. శివశంకర్ మాస్టర్ మరణ విషయం తెలియడంతో గుండె బద్దలైందని సోనూసూద్ ఎమోషనల్ అయ్యాడు.

కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా.. నటుడిగా ఎన్నో చిత్రాల్లో శివశంకర్ మాస్టర్ తన ప్రతిభను చూపించారు. పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తన మార్క్ చూపించారు. జబర్ధస్త్ వంటి కామెడీ షోల్లోనూ నవ్వించారు. అన్ని రకాలుగా దక్షిణాది సినీ ప్రేమికులను అలరించారు.

1975లో 'పాట్లు భరతమమ్' చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన శివశంకర్ మాస్టర్ (72) మొదట సహాయకుడిగా చేశారు. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ గా.. నటుడిగా అలరించారు. దాదాపు 30కిపైగా చిత్రాల్లో వైవిధ్యనటనతో నవ్వులు పంచారు. 'మగధీర' సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది.

శివశంకర్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ప్రార్థించారు.