వీడియో: తెల్ల కోకలో హంస రాణి!

Sun Mar 24 2019 23:48:25 GMT+0530 (IST)

Chitrangada Singh H0T Ramp Walk In Saree At BT Fashion Week 2019

తెల్ల కోక .. పచ్చల హారం.. కాటుక కళ్లు.. ఆ కాంబినేషన్ కి ఉండే గమ్మత్తు ఎలాంటిదో ఇదిగో ఇక్కడ అందాల హంసరాణి చిత్రాంగదను చూస్తే అర్థమవుతుంది. ముంబై ర్యాంప్ షోలో అదిరిపోయే క్యాట్ వాక్ తో బాలీవుడ్ కథానాయిక చిత్రాంగద సింగ్ వీక్షకుల గుండెల్ని జిల్లనిపించింది. ముఖ్యంగా ఈ  సూపర్ మోడల్ స్పెషల్ డిజైనర్ లుక్ కుర్రకారుకు గిలిగింతలు పెట్టిందంటే అతిశయోక్తి కాదు. చిత్రాంగద తెల్ల కోకలో నడిచొచ్చిన తీరు.. అలా అందాల్ని ఆరబోసిన వైనం పదే పదే యువతరం ప్రస్థావిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.ఇక ఈ వీడియోలో పరిశీలనగా చూస్తే చిత్రాంగద మెడలోని పచ్చల హారానికి కుర్రకారు కళ్లప్పగించడం ఖాయం. ఈ వేదికపై ఎందరు క్యాట్ వాక్ మోడల్స్ ఉన్నా కళ్లన్నీ చిత్రాంగదపైనే. అంతగా ఈ అమ్మడు డెకరేట్ అయ్యి ర్యాంప్ వాక్ చేసింది.  ముఖ్యంగా ఓపెన్ టాప్ డిజైనర్ శారీలో మతి చెడే లుక్ తో మైమరిపించింది అంతే. ముంబై ఫేజ్ 3 ప్రపంచం మిరమిరలన్నీ చిత్రాంగద హావభావాల్లో పరిశీలనగా చూడొచ్చు. ఇక ఈ రేంజులో అందాల్ని ఆరబోసిన ఈ అమ్మడి వయసు ఎంతో తెలుసా?  50 కి ఆరేళ్లు తక్కువ. అంటే 44 సంవత్సరాలు అన్నమాట!

ఇక ఈ అమ్మడిని కెరీర్ పరంగా పరిశీలిస్తే...2018లో మూడు సినిమాల్లో నటించింది. బజార్ సూర్మ సాహెబ్ - బివి ఔర్ గ్యాంగ్ స్టర్ 3 చిత్రాల్లో నటించింది. ఓవైపు ముంబై పరిశ్రమలో మరోవైపు పంజాబీ ఇండస్ట్రీలోనూ ఈ అమ్మడు కెరీర్ ని సాగిస్తోంది.