Begin typing your search above and press return to search.

చిరు vs బాలయ్య.. సెకండ్ రౌండ్ విజేత ఎవరు?

By:  Tupaki Desk   |   9 Jun 2023 11:12 AM GMT
చిరు vs బాలయ్య.. సెకండ్ రౌండ్ విజేత ఎవరు?
X
టాలీవుడ్ లో అగ్ర హీరోలైన బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య చాలా కాలం నుంచి సినిమాల విషయంలో ఒక పోటీ ఉంటుంది. నందమూరి అభిమానులు బాలయ్య సినిమాని సూపర్ హిట్ చేయాలని రిలీజ్ టైమ్ లో ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకి మెగా అభిమానుల నుంచి అంతే సందడి ఉంటుంది.

ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ సినిమాతో పోటీ పడినపుడు ఒక్కోసారి ఒక్కొక్కరు విజేతగా నిలిచారు. ఈ ఏడాది ఆరంభంలో ఒకే బ్యానర్ నుంచి చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటిలో వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక వీరసింహారెడ్డి కూడా హిట్ అయిన భారీ లాభాలు అయితే తీసుకురాలేదు. బ్రేక్ ఎవెన్ దాటి 2 నుంచి 3 కోట్ల వరకు అదనంగా వచ్చాయి. నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా భాగా ఆదాయం వచ్చింది.

ఏది ఏమైనా థియేటర్స్ లో వాల్తేర్ వీరయ్య మూవీ విజేతగా నిలిచింది. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకి రానున్నారు.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో సెప్టెంబర్ 20న బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ రిలీజ్ కాబోతోంది. ఫెయిల్యూర్ లేని దర్శకుడితో బాలయ్య సినిమా రాబోతూ ఉండగా, డిజాస్టర్స్ తో పదేళ్ళు సినిమాలకి దూరమైన మెహర్ రమేష్ తో మెగాస్టార్ సినిమా రాబోతోంది. అలాగే భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ రీమేక్ గా వస్తోంది.

ఇక బాలయ్య చిత్రం అనిల్ రావిపూడి సొంత కథతో చేస్తున్నాడు. ఏ విధంగా చూసుకున్న ఈ సారి మాత్రం బాలయ్య లీడింగ్ బాక్సాఫీస్ విన్నర్ అవుతాడని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక భోళా శంకర్ హిట్ అనేది మెగాస్టార్ మానియా మీద ఆధారపడి ఉంటుంది. హిట్ అయితే కలెక్షన్స్ పరంగా మెగాస్టార్ రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది.