Begin typing your search above and press return to search.

మెగా భోళా మేనియా... ఇక షురూ చేయాల్సిందే!

By:  Tupaki Desk   |   30 May 2023 2:16 PM GMT
మెగా భోళా మేనియా... ఇక షురూ చేయాల్సిందే!
X
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా షూటింగ్ దాదాపు దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్లో ఒక రెండు మూడు సన్నివేశాలు షూట్ చేస్తే ఇక మొత్తం షూట్ వర్క్ కూడా ఫినిష్ అయినట్లే. ఇక దర్శకుడు మెహర్ రమేష్ వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే మరోవైపు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా వేగాన్ని పెంచేందుకు చిత్ర యూనిట్ అడుగులు వేస్తోంది.

ఇప్పటికే కొన్ని స్పెషల్ పోస్టర్స్ కూడా విడుదల చేశారు. అయితే సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వలన మొన్నటి వరకు చిత్ర యూనిట్ ఆలస్యం చేస్తుంది అని కామెంట్స్ అందుకుంది. కానీ మొత్తానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లుగా ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. అద్భుతమైన పోస్టర్ కూడా వదిలారు.

భోళా శంకర్ బోలా మేనియా త్వరలోనే మొదలవుతుంది అంటూ మెగాస్టార్ స్టైలిష్ స్టీల్ ఇచ్చిన ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ ఇప్పుడు మెగా ఫాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి అతను ఒక హీరో సినిమాకు వర్క్ చేస్తున్నాడు.

దీంతో ఈ సినిమా మ్యూజిక్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి గత సినిమాల పాటలు కూడా చాలా బాగా హీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మెగాస్టార్ తో ఈ కాంబినేషన్ నుంచి ఎలాంటి సాంగ్స్ వస్తాయి అనేది హైలెట్ అవుతుంది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను విడుదల చేయబోతున్నారు.

భోళా శంకర్ సినిమాలో ఆగస్టు 9వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆమధ్య సినిమా విడుదల వాయిదా పడవచ్చు అనే రూమర్స్ కొన్ని వచ్చాయి. కానీ అందులో ఎలాంటి అనుమానం లేదు అని అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుంది అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ సోదరిగా కనిపిస్తూ ఉండగా తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.