Begin typing your search above and press return to search.

చిరంజీవి మళ్లీ అది చూపించబోతున్నారా?

By:  Tupaki Desk   |   30 May 2023 11:05 AM GMT
చిరంజీవి మళ్లీ అది చూపించబోతున్నారా?
X
మెగాస్టార్‌ చిరంజీవి ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించారు.. విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు. ఆయన ఏడిపించారు.. నవ్వించారు... కోపం తెప్పించారు.. కవ్వించారు ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ ను పండించిన మెగాస్టార్‌ చిరంజీవిని ఎక్కువగా కామెడీ సినిమాల్లో మరియు పాత్రల్లో నటించాలని అభిమానులు కోరుకుంటారు.

మొన్న సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా లో కొన్ని సన్నివేశాల్లో కామెడీ తో మెప్పించిన విషయం తెల్సిందే. అంతకు ముందు కూడా అందరి వాడు మరియు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో కూడా కామెడీ తో మెప్పించి సక్సెస్ లను దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే తరహా లో కామెడీ యాంగిల్‌ ను చూపించబోతున్నాడు.

చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ ను చాలా కాలంగా అభిమానులు మిస్ అవుతున్నారు. ఒక వైపు ఎమోషనల్ మరియు సెంటిమెంట్ సన్నివేశాలు ఉంటూనే మరో వైపు చిరు మార్క్ కామెడీ సన్నివేశాలను దర్శకుడు మెహర్‌ రమేష్‌ 'భోళా శంకర్' సినిమాలో చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సినిమా మొదలు పెట్టి చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల భోళా శంకర్ సినిమా తర్వాత ప్రారంభం అయిన సినిమాలు కూడా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ భోళా శంకర్‌ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. ఆగస్టు లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

స్టైలిష్ మూవీస్ కు పెట్టింది పేరు అయిన మెహర్‌ రమేష్ ఈ సినిమాలో చిరును స్టైలిష్ గా చూపిస్తూనే మరో వైపు ఆకట్టుకునే కామెడీ టైమింగ్ లో కూడా చిరును చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి నుండి ఈ వయసులో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఎవరు కూడా కోరుకునే పరిస్థితి లేదు అని... ఆయన కామెడీ చేస్తే అభిమానులకు పండగే అంటూ కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తమన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో ఒక యంగ్‌ హీరో కూడా కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి మాస్ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.