Begin typing your search above and press return to search.

సీఎం పదవి కంటే చిరంజీవి పదవి గొప్పది

By:  Tupaki Desk   |   10 Jun 2021 5:30 AM GMT
సీఎం పదవి కంటే చిరంజీవి పదవి గొప్పది
X
క‌రోనా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల‌కు సినీపరిశ్ర‌మ‌కు నేనున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి సేవ చేస్తూనే ఉన్నారు. సీసీసీ ప్రారంభించి కార్మికులకు నిత్యావ‌స‌రాల సాయం చేసిన చిరంజీవి ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి క‌రోనా రోగుల ప్రాణాల్ని కాపాడుతున్నారు. వీటిద్వారా ల‌బ్ధి పొందిన వారు గొప్ప ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో క‌ష్టంలో ఉన్నావారికి చిరు ఆర్థిక విరాళాల్ని అందిస్తున్నారు. ప్ర‌జ‌లు అభిమానులు క‌ష్టం ఉంద‌ని కాల్ చేస్తే ఆదుకోకుండా లేరు. అందుకే ఆయ‌న‌కు అభిమానులు రాజ‌కీయ పార్టీల‌తో సంబంధం లేకుండా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నారు.

తాజాగా టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కన‌టుడు దేవీ ప్ర‌సాద్ మెగాస్టార్ ని ఉద్ధేశిస్తూ రాసుకున్న ఫేస్ బుక్ పోస్ట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

``ఓ మనిషికి మరో మనిషి నుండి దానాన్నో దాతృత్వాన్నో తమ హక్కు గా ఆశించే హక్కులేదు. దానికి కొలతలు వేసే హక్కు అసలే లేదు. అది ఇచ్చేవారి హృదయవైశాల్యానికీ పుచ్చుకొనేవారి కృతజ్ఞతాభావానికి సంబంధించిన విషయం మాత్రమే. సమాజం కుల-మత-ప్రాంత -పార్టీలుగా విడిపోయివున్నప్పుడు ఏ మనిషి ఎంత మంచి చేసినా విమర్శించేవారు వుంటూనే ఉంటారు. ప్రశంస పాక్షికంగానే వుంటుంది. విమర్శకంటే సత్సంకల్పం ఎప్పుడూ వేలమెట్లు పైనే వుంటుందని విజ్ఞులందరికీ తెలుసు. విపత్కర పరిస్థితుల్లో తెలుగు సినీపరిశ్రమలో తోటివారిని కలుపుకుని ఓ పెద్దన్నయ్యలా బాధ్యతను తీసుకొని ఆపన్నులకు అద్భుతసాయాన్ని అందిస్తున్న చిరంజీవి గారిని చిత్రపరిశ్రమ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది.

అవసరమైన సమయంలో ఆక్సిజెన్ అందించి ప్రాణాలు నిలుపుతున్నందుకు తెలుగుప్రజల మనసుల్లో ఆయన ధన్యజీవి గా నిలిచిపోతారు.

సీఎం అనే పదవికంటే చిరంజీవి అనే పదవి గొప్పది అని ఎవరో అన్నట్లు.... అచ్చంగా నా అభిప్రాయమూ అదే. రెండక్షరాల సీఎం అనే రెండుకాళ్ళ కుర్చీకంటే నాలుగక్షరాల `మెగాస్టార్` అనే నాలుగుకాళ్ళ సింహాసనం ఎప్పటికీ పదిలం. రాజకీయపుటెత్తులు పై ఎత్తులు పొత్తులతాకిడి కి ఆ కుర్చీ ఎప్పుడైనా కూలిపోవచ్చు. తరగని అభిమానంతో ప్రేక్షకాభిమానులు వారి హృదయాలలో ప్రతిష్టించుకున్న ఈ సింహాసనం ఎప్పటికీ చెక్కుచెదరదు. దానిపై ఆశీనులైవున్న చిరంజీవిగారు వర్ధిల్లుతూనేవుంటారు.. అంటూ సుదీర్ఘ నోట్ ని రాసారు.

దానికి స్పందిస్తూ మెగాస్టార్ ఒక వాయిస్ నోట్ ని పంపారని దేవీ తెలిపారు. చిరంజీవిగారితో నాకు పరిచయం లేదు.. ఆయనతో పని చేయలేదు కానీ నా `మిస్టర్ పెళ్ళికొడుకు` లాంచింగ్ కి విచ్చేసి తొలి క్లాప్ కొట్టి వెళ్ళారని ఆ కొద్ది సమయానికి నేనాయనకు గుర్తుండే అవకాశమే లేదని అన్నారు. కానీ! మొన్న నేను ఆయన చేస్తున్న సేవ గురించి నా మనసులో ఉన్నది రాసి మెగాస్టార్ బొమ్మ గీసి పోస్ట్ చేసిన 24 గంటలు గడవకముందే ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాకు వాయిస్ మెసేజ్ పంపార‌ని తెలిపారు.

లీలామహల్ సెంటర్- పాండు- బ్లేడ్ బాబ్జి- కెవ్వుకేక- మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని తెర‌కెక్కించిన దేవీ ప్ర‌సాద్ శ్రీ‌విష్ణు `నీది నాది ఒకే కథ`లో తండ్రి పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. క‌ల్కి చిత్రాల్లోనూ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించారు.