చిరు vs మహేష్.. ఏమవుతుందో?

Wed Mar 22 2023 09:42:46 GMT+0530 (India Standard Time)

Chiranjeevi and MaheshBabu Films on Same Day

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. తమిళ హిట్ మూవీ వేదాలం రీమేక్ గా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది. తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న సినిమాగా ఇది ఉందని చెప్పాలి. ఇదిలా ఉంటే ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అంటే కచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా కూడా ట్రెండింగ్ అవుతాయి. అయితే భోళా శంకర్ రిలీజ్ అప్డేట్ వచ్చిన కూడా సోషల్ మీడియాలో ఆశించిన స్థాయిలో స్పందన లేదని చెప్పాలి.

 ఆగస్టు 11న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ట్రెడిషనల్ లుక్ లో కీర్తి సురేష్ తమన్నా కూర్చుని ఉండగా మెగాస్టార్ చిరంజీవి నిలబడి ఉన్న స్టిల్ ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి డేట్ ని నిర్మాత నాగవంశీ ఎనౌన్స్ చేశారు. అయితే ఆఫీషియల్ గా మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా బోళా శంకర్ సినిమాతో రాబోతూ ఉండడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి చరిష్మా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కచ్చితంగా అతని సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సొంతం చేసుకునే హీరోగా ఉన్నారు.

ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ అంటే కచ్చితంగా ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంటుంది. అయితే బోళా శంకర్ రిలీజ్ అనౌన్స్మెంట్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నిర్మాత రాధాకృష్ణకి  ఒక్క మాటైనా చెప్పలేదని టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు వెనక్కి తగ్గే అవకాశం ఉంది అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.