ఫోటో టాక్: పిల్లను వెతికి పెళ్లి చేయండమ్మా

Tue Jan 21 2020 22:38:23 GMT+0530 (IST)

Chiranjeevi With Prabhas

ఈ ఫోటో చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెబుతున్నట్టే ఉంది కదూ?  నిజమే.. సీనియర్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించే అందరిలోనూ టెన్షన్. యంగ్ రెబల్ పెళ్లాడేస్తానంటూనే స్కిప్ కొట్టేస్తున్నాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఆయన సతీమణి శ్యామలాదేవి ఎంతో టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే.పత్రికలు.. టీవీ చానెళ్ల ఇంటర్వ్యూలో ప్రభాస్ స్కిప్ స్వభావంపై చాలాసార్లు బెంగను వ్యక్తం చేశారు. అయితే అతడిని ఒప్పించే బాధ్యత ఏమైనా మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారా?  మరోసారి ప్రభాస్ పెదనాన్న పెద్దమ్మల చెంత ఇదిగో ఇలా చిరునే ఆ మాట ఏదో అనేశారనే అనిపిస్తోంది. ``త్వరగా పిల్లను చూసి పెళ్లి చేసేయండమ్మా!`` అని చిరు అంటుంటే ఆ పక్కనే ఉన్న ప్రభాస్ మాత్రం నవ్వేస్తున్నాడు.

ఇటీవల కృష్ణంరాజు బర్త్ డే వేడుకల్ని ప్రభాస్ అండ్ టీమ్ ఘనంగా జరిపించారు. రాజుల వంటకాల్ని అతిథులకు రుచి చూపించారు. ఈ పార్టీకి చిరు కూడా అటెండయ్యారట. మెగాస్టార్ చిరంజీవి- రెబల్ స్టార్ కృష్ణంరాజు మూవీ ఆర్టిస్టుల సంఘం పెద్దలుగా గౌరవనీయమైన పొజిషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్టిస్టుల వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించే కమిటీలో వీరు ఉన్నారు. ఇక రాజకీయాల్లోనూ ఆ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.