నాకు అతనే మెగా స్టార్

Tue Aug 20 2019 16:05:34 GMT+0530 (IST)

Chiranjeevi Speech at Sye Raa Movie Teaser Launch

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ 'సైరా నర్సింహ రెడ్డి' టీజర్ విడుదలైంది. ముంబైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి టీజర్ ని రిలీజ్ చేశారు. ఆరు పదుల వయసులోనూ యుద్ధ సన్నువేశాల్లో తన దైన రాజసం చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు మెగా స్టార్. సినిమాలో నర్సింహ రెడ్డి పాత్రలో చిరు ఒదిగిపోయి నటించాడని విషయం టీజర్ చూస్తే తెలిసిపోతుంది.ఇక ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిరు సంతోషంగా మాట్లాడాడు. ఎట్టకేలకు నా కల నెరవేరింది. చరణ్ - సురేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి 'సైరా'ను ప్యాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దారు అంటూ మురిసిపోయాడు. టీజర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయని బాలీవుడ్ రిపోర్టర్ అనగానే చిరు మొఖం వెలిగిపోయింది. తన అభిమానులను సంతోష పరుస్తూ తెలుగు సినిమా ఖ్యాతిను తన వంతుగా పెంచడానికి పూనుకొని అత్యధిక బడ్జెట్ తో చరణ్ తో కలిసి చిరు 'సైరా'ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకే అభిమానుల నుండి మీడియా నుండి వచ్చిన రెస్పాన్స్ కి ఫుల్ ఖుషీ అయ్యారు మెగాస్టార్.

ఇక ఇద్దరు మెగా స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. బిగ్ బీతో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పమని రిపోర్ట్ అడగ్గా.. అమితాబ్ జి నా రియల్ లైఫ్ మెంటర్. నాకు ఆయనే మెగాస్టార్. 'సైరా'లో నా క్యారెక్టర్ కి గురువుగా అమితాబ్ గారైతే బాగుంటుందని సురేందర్ రెడ్డి నాతో అన్నాడు. వెంటనే నేను ఆయనకి కాల్ చేసి విషయం చెప్పి ఒక వారం టైం తీసుకోమని చెప్పాను. కానీ ఆయన వెంటనే తప్పకుండా చేస్తాను చిరంజీవి అంటూ మాటిచ్చి వెంటనే డైరెక్టర్ ని పంపించమని చెప్పి ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ సందర్బంగా ఇండియన్ మెగా స్టార్ అమితాబ్ గారిని నా థాంక్స్ అంటూ స్పీచ్ ముగించారు చిరు. ఈరోజు నుండి 'సైరా' టీజర్ హంగామా మొదలైంది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ వదలనున్నారు. అక్టోబర్ 2న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.