చిరు మంచితనం.. పిల్లాడికి నామకరణం

Mon Apr 22 2019 19:53:21 GMT+0530 (IST)

Chiranjeevi Named Pavan Shankar for his Hardcore fan SON

మెగాస్టార్ చిరంజీవి మొదటి నుండి కూడా తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటూ - వారిని ఎప్పటికప్పుడు ఆనందింపజేసేందుకు చూసేవాడు. మెగా అభిమాని ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసినా - లేదా మరే సమస్య వచ్చినా కూడా చిరంజీవి మంచి మనసుతో ముందుకు వచ్చి సాయం చేయడం మనం గతంలో ఎన్నో సార్లు చూశాం. మొన్నటికి మొన్న కూడా అభిమానానికి చిరంజీవి సాయం చేయడం మనం చూశాం. తాజాగా మరోసారి చిరంజీవి తన మంచితనంను చూపించారు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నక్కా వెంకటేశ్వరరావు అనే అభిమానికి కొడుకు పుడితే ఆ బాబుకు నామకరణం చేశాడు. అభిమాని కోరిక తీర్చడం కోసం వారిని ఇంటిపి పిలిపించుకుని ఫ్యాన్ తనయుడికి పవన్ శంకర్ అంటూ పేరు పెట్టి ఆశీర్వదించాడు. నక్కా వెంకటేశ్వరరావు చిన్నప్పటి నుండి కూడా చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో వెంకటేశ్వరరావు సొంత గ్రామం అయిన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం - మందపల్లి గ్రామంలో పార్టీ నిర్మాణంకు క్రియాశీలకంగా వ్యవహరించాడు.

ఆ సమయంలో వెంకటేశ్వరరావును గ్రామస్తులు రాజకీయంగా వెలి వేయడం జరిగింది. ప్రజారాజ్యంకు మద్దతు ఇస్తున్నందుకు బహిష్కరించారు. ఆ సమయంలోనే చిరంజీవి స్వయంగా వెంకటేశ్వరరావును కలిసి తోడుగా ఉంటానంటూ హామీ ఇచ్చాడు. తాజాగా వెంకటేశ్వరావుకు తనయుడు పుట్టడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అయినా నా కొడుక్కు చిరంజీవి గారే నామకరణం చేయాలంటూ సంవత్సరం నుండి పిల్లాడికి పేరు పెట్టకుండా ఉన్నాడు. ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకున్న చిరంజీవి నేడు వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులతో సహా ఇంటికి రమ్మని పిల్లాడికి నామకరణం చేయడం జరిగింది. మరోసారి చిరంజీవి అభిమానుల మెగాస్టార్ అనిపించుకున్నాడు.